School Bus Accident: ఘోరం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
Container Hits Private School Bus in Chittoor District
ఆంధ్రప్రదేశ్

School Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లో ఏడుగురు విద్యార్థులు..!

School Bus Accident: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగరాజపూరం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో బస్సులో చివరి సీట్లలో కూర్చున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా.. వారిలో ఓ విద్యార్థి నాలుక తెగిపోయింది.

Also Read: Woman Constable Suicide: వరంగల్‌లో ఘోరం.. ఇద్దరు యువకుల వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అటుగా వెళ్లే వాహనదారులు.. బస్సులోని విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులకు సమాచారం అందించడంతో వారు కూడా ఘటన స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

Also Read: Archana Ravichandran: పవిత్ర కొండపై బుల్లితెర నటి వెకిలి చేష్టలు.. సీరియస్ అయిన అధికారులు..

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?