Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత (kcr) కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంలో తెలుసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) సిరిసిల్ల నుంచి, హరీష్ రావు( Harish Rao) సిద్దిపేట నుంచి గురువారం సాయంత్రం ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. సిట్ నోటీసులపై చర్చించారు.ఇప్పటికే ఈ కేసులో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు సైతం సిట్ విచారణకు హాజరు కావడంతో అధికారులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానం పై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు న్యాయవాదులతో సంప్రదింపులు చేశారు.
Also Read: Phone Tapping Case: త్వరలో కేసీఆర్‌కు నోటీసులు? గులాబీ నేతల్లో సిట్ తీరుపై చర్చ!
ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు?
7గంటలకు పైగా విచారణ పేరుతో ప్రశ్నలు వేయడం, (Phone Tapping Case) ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు? ఆదేశాలు ఎవరెవరికి ఇచ్చారు? ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారని అధికారులు అడిగిందే మళ్లీ మళ్లీ అడిగినట్లు కేసీఆర్ కు వివరించినట్లు సమాచారం. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కాలయాపనచేస్తుందని, ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత కారణంగానే అటెన్షన్ డైవర్షన్ కోసం చేస్తుందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో రాజకీయంగా ఎదుర్కోలేక సిట్ పేరుతో ముందుకు వచ్చిందని, దీంతో ఒరిగేదేమీలేదని.. ప్రభుత్వమే బద్నాం అవుతుందని నేతలతో కేసీఆర్ అన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించినట్లు సమాచారం.
Also Read: Phone Tapping Case: ఆ కీలక నేత ఎవరో నాకు తెలియదన్న హరీష్ రావు.. త్వరలో మరికొందరికి నోటీసులు

