Jogipet Municipality: ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఖరారు
Congress party announces councillor candidates and municipal chairman nominee in Jogipet municipality
మెదక్, లేటెస్ట్ న్యూస్

Jogipet Municipality: ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఖరారు… జోగిపేటలో ఇదీ పరిస్థితి

Jogipet Municipality:
జోగిపేట,స్వేచ్ఛ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీ (Jogipet Municipality) పరిధిలోని అధికార కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్‌ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠభరిత మైన వాతావరణం మద్య ఎట్టకేలకు జరిగింది. మున్సిపాలిటీలో 20 వార్డులుండగా 16 వార్డులు దాదాపు పూర్తి కాగా, మాజీ కౌన్సిలర్‌ ఎ.చిట్టిబాబు పోటీ చేయాలనుకున్న 15వ వార్డును మైనార్టీలకు ఇచ్చేందుకు మొగ్గు చూపగా, పార్టీకి పదేళ్లుగా సేవలు అందించి, పటిష్టతకు పనిచేసినందుకుగా చిట్టిబాబుకే మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఖరారు చేశారు. 14,17 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక భాద్యతను కూడా ఆయనకే అప్పగించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా న్యాయవాది ఎస్‌.కిష్టారెడ్డి పేరును కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆయన 20వ వార్డు నుంచి పోటీకి దిగనున్నారు. నామినేషన్ల చివరి రోజున అధికార కాంగ్రెస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టికెట్ల విషయంలో ఆశావహులు ఉత్కంఠతో ఉండగా గురువారం నాడు తెరపడింది. ముఖ్యంగా చిట్టిబాబు అభ్యర్థిత్వం ఖరారుపై పట్టణంలో చర్చనీయాంశమైంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?