Kishan Reddy: రిజన యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరు
Kishan Reddy: ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kishan Reddy: ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరును పెడతాం. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: ప్రపంచ గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచుతూ భక్తులకు కొంగు బంగారంగా వరాలను అందిస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అత్యంత కీలక ఘట్టంగా పేర్కొనే సమ్మక్క గద్దెపైకి వచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం, కిషన్ రెడ్డి (Kishan Reddy) హాజరయ్యారు.

Also Read:Medaram Jatara2026: మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం కీలక ప్రకటనలు! 

రిజన యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరు

వారికి రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రమిత్ర లో ఘన స్వాగతం పలికి వనదేవతల దర్శనాలను చేయించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ములుగు జిల్లాలో నిర్మించే గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారలమ్మ పేరును పెడతామని స్పష్టం చేశారు.

వంద రోజుల్లోనే రూ.251 కోట్లతో అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద గిరిజన జాతర కు కేంద్ర ప్రభుత్వం నుంచి అతిథులుగా కేంద్ర గిరిజన శాఖ జుయల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లను ముఖ్య అతిథులుగా పంపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మహా జాతర మేడారం లో శాశ్వత పునర్నిర్మాణ పనుల విషయంలో అత్యంత గౌరవాన్ని ఇస్తూ అభివృద్ధి పనులను చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు. వంద రోజుల్లోనే రూ.251 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం మేడారం మహా జాతరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుందని వెల్లడించారు.

Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ షురూ.. మొదటి రోజే తొర్రూరులో జోరందుకున్న ఇంటింటి ప్రచారం!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?