BRS: వరుస విచారణలతో గులాబీ నేతల్లో గుబులు
BRS ( image credit: twitter)
Political News

BRS: వరుస విచారణలతో గులాబీ నేతల్లో గుబులు.. డ్యామేజీ కంట్రోల్ ఎలా?

BRS:  బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టిసారించింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కేడర్ నైరాశ్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటుంది. పార్టీ కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటంతో దానిని కంట్రోల్ చేసుకునేందుకు గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని మున్సిపాలిటీకి ఒకరిని ఇన్ చార్జీగా నియమించిందనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంపై ఒక వైపు విమర్శల స్పీడ్, మరోవైపు చేరికలను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్ కు సైతం నోటీసులు

రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రధానప్రతిపక్షంగా ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలంతా సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ కు సైతం నోటీసులు రెండుమూడ్రోజుల్లో అందే అవకాశం ఉందని ఆయన సైతం విచారణకు హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది. ఇది ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని పార్టీ నేతల్లోనే చర్చకు దారితీసింది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే పావులు కదుపుతుంది.

Also Read: BRS Party: మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన.. నేతల పర్యటనలపై రాని స్పష్టత!

కాంగ్రెస్ పార్టీ లీకులు

ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉందని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగానైతే 40శాతం సీట్లు సాధించామో అదే విధంగా మున్సిపాలిటీల్లోనూ సాధిస్తామని ఇప్పటికే పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఈ తరుణంలోనే సిట్ అధికారులు విచారణల పేరుతో పార్టీ అగ్రనేతలను పిలువడంతో పార్టీ కేడర్ లో కొంత నైరాశ్యానికి గురవుతున్నారు. ఇది పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపుతుందని మున్సిపాలిటీల్లోని నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చి అసత్య ఆరోపణలు, వార్త కథనాలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుందని చేస్తున్న విమర్శలు ప్రజలకు ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదని, హామీలు గ్యారెంటీలపై చేస్తున్న ఆరోపణలు సైతం రిసీవ్ చేసుకోవడం లేదనే పార్టీ కేడర్ నైరాశ్యానికి గురవుతున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కలిసి వస్తాయా?

మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగబోతుండటంతో అర్బన్ ప్రాంత ప్రజల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉందని పార్టీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు కలిసి వస్తాయా? లేదా? అని పార్టీ ఇన్ చార్జులతో వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయిన కేసీఆర్.. ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అయితే ఆ ప్రణాళికలు ఏ మేరకు పనిచేస్తాయనేది చూడాలి.

మున్సిపాలిటీలపై ప్రత్యేక ఫోకస్

చాలా మున్సిపాలిటీల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ నుంచి ఆసక్తి చూపడం లేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, మున్సిపాలిటీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం, ఖర్చు సైతం పెట్టేందుకు సిద్ధంగా ఉండటం, కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్బన్ ప్రజల్లో ఆశించిన స్థాయిలో వ్యతిరేకత లేకపోవడం ఇవన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెనుకంజ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ నుంచి కూడా ఫండ్ పై స్పష్టత లేకపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తున్నారు. అయినప్పటికీ ఖర్చు చేసి ఓడిపోవడం ఎందుకనే భావనలో ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ వారికి ఎలాంటి భరోసా ఇస్తుందనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీఆర్ఎస్ కు మాత్రం పరీక్ష కానుందని సమాచారం. అన్ని ఒడిదుడుకులను అధిగమించి గులాబీ ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Also Read: BRS Flexi Dispute: బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర గ్రామంలో ఇలా జరిగిందేంటి?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?