BRS Party: మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన నేతలపై రాని స్పష్టత!
BRS Party (image credit: twitter)
Political News

BRS Party: మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన.. నేతల పర్యటనలపై రాని స్పష్టత!

BRS Party: మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్‌ను తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) చేయబోతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎలా అధ్యయనం చేస్తారు. నేతలను ఎలా సమన్వయం చేస్తారు.. పార్టీని ఎలా విజయ తీరాలకు నడిపిస్తారనేది ఇప్పుడు సర్వత్రా టాపిక్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మెజార్టీ మున్సిపాలిటీలో విజయం సాధించాలని అందుకు కార్యాచరణ సైతం సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించింది. అంతేకాదు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇన్‌ఛార్జ్‌లను సైతం నియమించింది. నేతల సమన్వయ బాధ్యతలను.. పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను నివేదించాలని ఆదేశించింది. అయితే ఆ ఇన్‌ఛార్జ్‌ల మానిటరింగ్‌ను తెలంగాణ భవన్ నుంచి చేస్తామని పార్టీ ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎలా చక్క దిద్దుతారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.

రెండు వర్గాలుగా గులాబీ నేతలు

ఒక్కో మున్సిపాలిటీలో ఇప్పటికే రెండు వర్గాలుగా గులాబీ నేతలు విడిపోయారు. ఒక వర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఈ గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. వీటిని చక్కదిద్దాలని గతంలో పార్టీ అధిష్టానంతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నేతలు విజ్ఞప్తులు చేసి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే లేక మాజీ ఎమ్మెల్యేలకే పార్టీ ప్రాధాన్య ఇవ్వడంతో అసంతృప్తితో క్యాడర్ ఉంది. ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా కలిసిపోతారనేది ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశమైంది.

Also Read: BRS Party: వరంగల్‌లో ఒకలా? సికింద్రాబాద్‌లో మరోలా? బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి!

ఇన్‌ఛార్జ్‌లు.. మాజీ ఎమ్మెల్యేలు కలిసి పోతారా

మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా పార్టీ సీనియర్ నేతలను నియమించింది. ఇప్పటివరకు ఆ మున్సిపాలిటీలపై మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలదే ఆధిపత్యం. వారు చెప్పిందే వేదం. అయితే ఇప్పుడు పార్టీ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడంతో ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. అదేవిధంగా మున్సిపాలిటీలో నేతల మధ్య సమన్వయం లోపం ఉండడంతో వాటిని సైతం ఎలా పరిష్కరిస్తారు.. ఎలా ముందుకు పోతారు.. ఒకవేళ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయనిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. పార్టీ అధిష్టానం సైతం వీరిని భవన్ నుంచి ఎలా మానిటరింగ్ చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఫండింగ్ ఎలా?

మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. కానీ, ప్రచార ఖర్చు ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక్కో మున్సిపాలిటీలో సుమారు 15 నుంచి 30 వరకు డివిజన్లు(వార్డులు) ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో పోటీకి సైతం అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పార్టీ పండు ఇవ్వాలని ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమీక్ష సమావేశాల్లో పార్టీ అధిష్టానాన్ని నేతలు కోరినట్లు సమాచారం. ఇప్పటివరకు పార్టీ అధిష్టానం నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదని సమాచారం. ఎన్నికల ఖర్చు ఎలా అని అటు అభ్యర్థులతో పాటు ఇటు ఇన్‌ఛార్జ్ ఉన్న సైతం తర్జన భజన పడుతున్నారు. ఏది ఏమైనా గులాబీ పార్టీ అన్ని సమస్యలను అధిగమించి ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నదనేది ఆసక్తి నెలకొంది.

Also Read: BRS Party: మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పకడ్బంధీ వ్యూహం!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?