BRS Flexi Dispute: నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరికొకరు హెచ్చరిక
పార్టీకి మండల కమిటీ లేనందునే వర్గ విభేదాలా!
ప్రోటోకాల్ ప్రకారంగా లేనందునే తొలగించినట్లు స్పష్టం
ఇనుగుర్తి, స్వేచ్ఛ: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతర్గతంగా జరిగిన గొడవలు నేడు (జనవరి 24) ఎంపీ రవిచంద్ర పుట్టినరోజు వేడుకల సందర్భంగా స్పష్టంగా బహిర్గతమయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అయితే, ఈ క్రమంలో నాయకుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు వివాదానికి కారణమైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకమైన ఓ మండల నాయకుడు బహిరంగంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు పుట్టినరోజు జరిగేది రవిచంద్ర దేనా.. లేదా వేరే నాయకుల పుట్టినరోజా అంటూ ఫ్లెక్సీల పట్ల ఆగ్రహం చేశారట. దీంతో, పార్టీ నేతల మధ్య విభేదాల కారణంగా ఫ్లెక్సీని బహిర్గంగా తొలగించారు. తొలగించిన వ్యక్తిని పార్టీ సభ్యులు ప్రశ్నించారు.
Read Also- T Hub – CM Revanth: టీ-హబ్‌ను స్టార్టప్ కంపెనీలకే వదిలేయండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పుట్టినరోజు సందర్భంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో వద్దిరాజు రవిచంద్ర ఫొటో, నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫొటో చిన్నగా వేశారని, అంతే కాకుండా తన అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటో ఎందుకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాగైతే మాత్రం తొలగిస్తారా? అంటూ ఓ మాజీ సర్పంచ్ ప్రశ్నించగా.. ఒకరిపై ఒకరు నువ్వు ఎంత అంటే.. నువ్వెంత.. అంటూ బస్టాండ్ ఆవరణలో బహిర్గంగా దూషించుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. దీంతో, మండల కేంద్రంలో ఎన్నికల నాటి నుంచి బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు ఉన్నట్లు నిరూపితమైంది. సంఘటనను చూసిన ప్రజలు, కార్యకర్తలు తమ పార్టీకి మండల కమిటీ లేనందునే క్రమశిక్షణ లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విభేదాలు ఇంతటితోనే ఆగుతాయా.! లేదా ఇటువైపు దారి తీస్తాయో మరి వేచి చూడాలి!.
Read Also- KTR – Janasena Party: కేటీఆర్ ఇలాకాపై జనసేన కన్ను.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ.. హీటెక్కిన రాజకీయం!

