Malla Reddy: ధనిక తెలంగాణను దరిద్ర రాష్ట్రంగా మార్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది” అంటూ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట, లింగాపూర్ వార్డులో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీలత రమేష్, 11వ వార్డు అభ్యర్థి అఖిల సాయి కుమార్, 24వ వార్డు అభ్యర్థి నవనీత రమేష్, లింగాపూర్ పరిధిలోని 15వ వార్డు అభ్యర్థి కోర్పతి సత్తయ్యలకు అభ్యర్ధులను ప్రకటించారు .ఈ సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Also Read: Malla Reddy Son: మల్లారెడ్డి కుమారుడి ఇంటిలో ఐటీ అధికారులు.. నిజమేనా?
68 కౌన్సిలర్ స్థానాలు కైవసం
“కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకుడు కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని కేసీఆర్ పరిష్కరించి ప్రజలకు మంచి పాలన అందించార నీ కొనియాడారు. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 68 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, మూడు ఛైర్మన్ పీఠాలను గెలుచుకుంటామని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోయారు.
ప్రజలు బీఆర్ఎస్‌కే ఓటు వేస్తారు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకొని ప్రజలు బీఆర్ఎస్‌కే ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతకుముందు ప్రకటించారు.ఈ సందర్భంగా లింగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు బత్తుల కృష్ణ, ఓరుగంటి నాగులు, కొమ్ము విష్ణు బీఆర్ఎస్ పార్టీలో చేరి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాజమల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: MLA Mallareddy: మెగాస్టార్ ను మించిన మల్లారెడ్డి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..

