MLA Mallareddy: మెగాస్టార్ ను మించిన మల్లారెడ్డి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..
-
1 / 8
Image Source: Mallareddy FB
ఈయన ఒక ఎమ్మెల్యే. మెగాస్టార్ కు మించిన ఫాలోయింగ్ తనకు ఉందంటూ ఎన్నోసార్లు ఆయనే ప్రకటించుకున్నారు. -
2 / 8
Image Source: Mallareddy FB
మైక్ ముందు మాట్లాడినా, ఏదైనా పాటకు స్టెప్ వేసినా ఈయన ఒక సంచలనమే సృష్టిస్తారు. ఆయన ఎవరో కాదు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. -
3 / 8
Image Source: Mallareddy FB
70 ఏళ్లకు పైగా వయసుగల మల్లారెడ్డి నిత్యం సోషల్ మీడియాలో మెరుస్తూనే ఉంటారు. -
4 / 8
Image Source: Mallareddy FB
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డి, అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మిలియన్స్ లో వ్యూస్ తెచ్చాయంటే, మల్లారెడ్డికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
5 / 8
Image Source: Mallareddy FB
మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న మల్లారెడ్డి, మళ్లీ సోషల్ మీడియాలో ధగధగా మెరిసిపోతున్నారు. జపాన్ దేశం పర్యటనకు వెళ్లిన మల్లారెడ్డికి అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారు. -
6 / 8
Image Source: Mallareddy FB
యూత్ చెప్పుకున్నట్లుగా ఎంజాయ్ అంటే ఇదేరా మామ అనేవిధంగా ఆనందంగా ప్రతి క్షణాన్ని గడిపే మల్లారెడ్డి, టోక్యోలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. -
7 / 8
Image Source: Mallareddy FB
తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మల్లారెడ్డి, షేక్ చేసేస్తున్నారని చెప్పవచ్చు. జపాన్ దేశస్థుల సంప్రదాయ వస్త్రధారణ ధరించిన మల్లారెడ్డి ఫోటోలు వైరల్ కాగా నెటిజన్స్ మల్లారెడ్డా .. మజాకా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. -
8 / 8
Image Source: Mallareddy FB
ఎంతైనా మెగాస్టార్ కంటే తనకే ఫాలోయింగ్ ఎక్కువ అంటూ చెప్పుకున్న మల్లారెడ్డికి, నెటిజన్స్ మీరు సూపర్ సార్ అంటూ.. పొగడ్తలతో ముంచేస్తున్నారు.