Sridhar Reddy: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాటలకు, చేతులకు పొంతనలేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) ఆరోపించారు. మధిరలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రానున్న మునిసిపాలిటీ ఎన్నికల్లో బిజెపికి అంత ముఖ్యం కాదన్నారు. అభివృద్ధి కావాలంటే పనులు చేసే నాయకులని గెలిపించాలని కోరారు. అండర్పాస్ రైల్వే బ్రిడ్జి కోసం బిజెపి ప్రజల పక్షాన ఉండి అభివృద్ధి చేస్తుందన్నారు.
Also Read: Minister Sridhar Babu: తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు
మధిర మున్సిపాలిటీ ని అభివృద్ధి చేసి చూపిస్తా
మధిర అండర్పాస్ రైల్వే బ్రిడ్జి కోసం డిపిఆర్ తీసుకురావటంలో జాప్యానికి కారణం మధుర ప్రజలకు చూపండని సవాలు విసిరారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మధిర మున్సిపాలిటీ ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మధిర ప్రజలకు అండర్ డ్రైనేజీ పనుల జాప్యం పై డిప్యూటీ సీఎం భట్టి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి అయినందుకే మధిర ప్రజలు ఆనందం లేక అధిక భాధను అనుభవిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యంగా 20 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి చూపించి మునిసిపాటి ప్రజలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజలను అడగాలని హితవు పలికారు.
Also Read: Minister Sridhar Babu: మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

