Municipal Elections: మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల తొలి రోజున తోమ్మిది నామినేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ నరేష్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు దాదాపు 2000 మంది పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం వరకు ఘనమైన ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ అధికారుల సూచన మేరకు 17వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేశారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా.. రసవత్తరంగా మున్సిపల్ పోరు..!
తొలి రోజునే భారీ స్థాయిలో నామినేషన్లు
ఈ నామినేషన్ కార్యక్రమంలో గుగులోత్ నరేష్‌కు 17వ వార్డ్ మాజీ వార్డ్ కౌన్సిలర్ యాళ్ల పుష్పలత రెడ్డి ప్రతిపాదకురాలిగా (PROPOSER) వ్యవహరించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, భానోత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, యాళ్ల మురళీధర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ ఛైర్మన్ నాయని రంజిత్, మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ సుదగాని మురళి, పార్టీ సీనియర్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, లునావత్ అశోక్, దారా యాదగిరి రావు, కొండ్ర ఏల్లయ్య, ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ల తొలి రోజునే ఇంత భారీ స్థాయిలో ప్రజా సమీకరణతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీలో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా గుగులోత్ నరేష్ మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ నాయకత్వంలో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులే తన గెలుపుకు నిదర్శనమని, ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపారు.
Also Read: Municipal Elections: మున్సిపాలిటీ ఎన్నికలపై గులాబీ గురి.. గెలుపుకోసం సీరియస్ స్ట్రాటజీ సిద్దం

