Allegations on MLA: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై (Allegations on MLA Arava Sridhar) ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్‌గా మారింది. అయితే, ఈ వ్యవహారంలో అనూహ్య విషయం వెలుగుచూసింది. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై జనవరి 7న కేసు నమోదయింది. తన కుమారుడి విషయంలో కుట్ర పూరిత ఆలోచనలు చేసిందంటూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయింది. ఈ ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ 308(5),351(2),61(2), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో ఏముంది?
తన కొడుకు అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఒకటిన్నర నెల నుంచి వీణా అనే మహిళ తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేదని ఫిర్యాదులో సుశీల పేర్కొన్నారు. తన కొడుకు శ్రీధర్, మరో రాజకీయ నేత ముక్కా రూపానందరెడ్డి పట్ల ఈ మహిళ కుట్రపూరిత ఆలోచనలతో పన్నాగం పన్నిందని ఫిర్యాదులో ఆమె ఆరోపించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థినని చెప్పి తరచూ ఆర్థిక సాయం అడిగేదని వివరించారు. తన కొడకు శ్రీధర్, ముక్కా రూపానంద రెడ్డి కలిసి వీణా చదువుల కోసం సాయం చేశారని పేర్కొన్నారు. తన కొడుకైన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఆమె వేధిస్తోందని ఎమ్మెల్యే తల్లి సుశీల ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు జనవరి 7న ఆమె ఫిర్యాదు అందించారు.
Read Also- Kalwakurthy BRS: బీఆర్ఎస్ నేతల మధ్య ముదురుతున్న పంచాయతీ.. బరిలో నుంచి తప్పుకున్న నాయకుడు..?
ఎమ్మెల్యేపై దుష్ప్రచారం: జనసేన నేత నాగేంద్ర
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల పట్ల జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర స్పందించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై దుష్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింహాద్రిపురం గ్రామానికి చెందిన సృజన్ అనే వ్యక్తి చనిపోతే ఆ ఉద్యోగం అతడి కూతురి శైలజకు ఇచ్చారని తెలిపారు. వీణా ప్రొబిషనరీ పీరియడ్‌లో ఉన్నారని, ఐదేళ్లుగా వీణా సర్వీస్ రెగ్యులర్ కాలేదని, సర్వీస్ రిజిస్టర్ రెగ్యులర్ కాకపోయినా ఇన్ని రోజు ఎలా జీతం తీసుకొందని ఆయన ప్రశ్నించారు. ‘‘మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి పీఏగా ఉంటానని కోరింది. జనసేన పార్టీగా మేము తిరస్కరించాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మా ఎమ్మెల్యేకి మేసేజ్ చేసేది. ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచిన తర్వాత తరచూ కలవాలని ఇంటికి వెళ్లేది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంటికెళ్లి తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పింది. ఎమ్మెల్యేను పెళ్లి చేసుకుంటానంటూ ఆయన తల్లికి చెప్పింది. ఎమ్మెల్యే తల్లి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించారు. కొంతకాలంగా ఎమ్మెల్యేతో చాటింగ్ చేస్తూ వేధిస్తోంది’’ అని నాగేంద్ర మీడియాతో అన్నారు.
స్పందించిన మహిళా కమిషన్
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. ఫిర్యాదు చేసిన మహిళతో ఆమె ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాయపాటి శైలజ, ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు ధైర్యం చెప్పారు.
Read Also- Janasena MLA Viral Video: జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. సంచలన వీడియో పోస్ట్ చేసిన వైసీపీ

