Janasena MLA Viral Video: జనసేన ఎమ్మెల్యే రాసలీలలు..!
Janasena MLA Arava Sridhar Controversy
ఆంధ్రప్రదేశ్

Janasena MLA Viral Video: జనసేన ఎమ్మెల్యే రాసలీలలు.. సంచలన వీడియో పోస్ట్ చేసిన వైసీపీ

Janasena MLA Viral Video: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదస్పదంగా మారుతున్నాయి. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. విపక్ష వైసీపీ పార్టీ (YSRCP) స్వయంగా ఈ వీడియోను ఎక్స్ వేదికగా బయటపెట్టింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీధర్ కీచకపర్వమంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని.. మహిళా ఉద్యోగినిని ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది.

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వీడియో కాల్, వాట్సప్‌ చాట్‌ను వైసీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా MLA అత్యాచారం చేశారంటూ ఆరోపించింది. కోరిక తీర్చకుంటే మహిళ మూడేళ్ల కొడుకును చంపేస్తానంటూ MLA బెదిరించారని వైసీపీ అంటోంది. భర్తకు విడాకులు ఇవ్వాలని మహిళను బెదిరించడమే కాకుండా.. ఆమె భర్తకు కూడా ఫోన్ చేసి బెదిరించారంటూ వైసీపీ ఆరోపించింది.

Also Read: India – EU Free Trade Deal: భారత్ – ఈయూ వాణిజ్య ఒప్పందం.. భారీగా తగ్గనున్న ధరలు.. వస్తువుల లిస్ట్ ఇదే!

తాను ఎమ్మెల్యేనని.. ఏమైనా చేయగలనని అరవ శ్రీధర్ వేధించినట్లు వైసీపీ ఎక్స్ లో రాసుకొచ్చింది. ఎమ్మెల్యే కారణంగా సదరు ఉద్యోగిని.. గర్భవతి కూడా అయ్యిందని.. ఆమెను బెదిరించి అబార్షన్ చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇదేనా మహిళలకు కల్పించే రక్షణ? బాధితులకు ఏం న్యాయం చేస్తారు? అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ లకు వైసీపీ ట్యాగ్ చేసింది.

Also Read: SRLIP Project: ఎస్ఆర్ఎల్ఐపి భూసేకరణలో అధికారుల నిర్లక్ష్యం.. అంతా నేనే అంటూ సీనియర్ అసిస్టెంట్ చేతుల్లో వ్యవహారం

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?