Deputy CM Bhatti Vikramarka: దివ్యాంగుల కోసం ప్రభుత్వం రెండేళ్లలో రూ.100 కోట్లు ఖర్చు చేసిందని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం పది ఏళ్లలో దివ్యాంగులకు చేయలేనటువంటి పనులని ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేస్తుందన్నారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో ఆయన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు. చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు.
దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాలి
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల గురించి ఆలోచన చేసే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు. వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అన్నారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ తెలిపారు. సమాజంలో ఇతరులు కన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలని అన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలి. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోంది అన్నారు.
Also Read: Mallu Bhatti Vikramarka: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

