Seethakka: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క (Seethakka) ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన అనంతరం దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేశారు . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులందరూ క్రమశిక్షణతో మెలగాలని మంత్రి సీతక్క కోరారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూ విధానంను తప్పనిసరిగా పాటిస్తూ తల్లులను దర్శించుకోవాలని సూచించారు. భక్తులందరికీ శీఘ్ర దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Also Read: Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
భక్తుల అత్యుత్సాహం ఇబ్బందులు
కొంతమంది భక్తుల అత్యుత్సాహం వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకూడదని చెప్పారు క్యూలైన్లను డిస్టర్బ్ చేయకుండా, నిర్వాహకులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని కోరారు. ప్రతి భక్తుడు స్వీయ నియంత్రణతో, క్రమశిక్షణతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు వేగంగా వెళ్లరాదని, ఓవర్ స్పీడ్, ఓవర్ టేక్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, జాతరకు వచ్చే ముఖ్యులు కూడా సహకరించాలని కోరారు. భక్తులే మా ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క స్పష్టం చేస్తూ, అందరూ సహకరించి జాతరను శాంతియుతంగా, భక్తిభావంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

