Nagarkurnool Tragedy: నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి కుమార్తె సిరి (14) కుమారుడు హిమాన్షు (11), శ్రీకాంత్ రెడ్డి సోదరి కుమార్తె స్నేహ (15) హైదరాబాదులో చదువుతున్నారు. సెలవులు ఉండడంతో తమ సొంత గ్రామానికి వచ్చారు. ఆదివారం పిల్లలు అందరూ శ్రీకాంత్ రెడ్డితో గ్రామానికి సమీపంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి అనే రైతు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో హిమాన్షు వ్యవసాయ పొలంలో ఉన్న నీటి గుంత వద్ద సెల్ఫీ దిగబోయి నీటిలో పడిపోయాడు.
Also Read: Padma Awards 2026: పద్మశ్రీ అవార్డుల ప్రకటన.. ఇద్దరు తెలుగు వ్యక్తులకు పురస్కారం.. ఎవరెవరంటే?
రాణి అనే మహిళ పరుగున వచ్చి..
అతడిని కాపాడే ప్రయత్నంలో సిరి, నేహా సైతం నీటి గుంటలో పడిపోయారు. అక్కడే ఉన్న వేణుగోపాల్ రెడ్డి కుమార్తె విద్యాధరణి పిల్లలను కాపాడే ఆందోళనలో గోతిలో కాకుండా.. పక్కన లోతు తక్కువగా ఉన్నచోట పడిపోయింది. అరుపులు విని పక్క పొలంలో పనిచేస్తున్న రాణి అనే మహిళ పరుగు పరుగున వచ్చి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న విద్యాధరిణి ని బయటకు తీసింది. పిల్లలు ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఈతరానీ శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) విలవిలలాడాడు. అప్పటికే విషయం చుట్టుపక్కల వారి ద్వారా గ్రామస్తులకు తెలియజేయడంతో అందరూ కూడా చేరి నీటి గుంటలో పడి ప్రాణాలను కోల్పోయిన వారిని వెతికి బయటకు తీశారు. ఒకేరోజు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

