Padma Awards 2026: పద్మశ్రీ అవార్డ్స్ ప్రకటన.. ఇద్దరు తెలుగువారికి
Government of India announces Padma Shri awardees ahead of Republic Day celebrations
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Padma Awards 2026: పద్మశ్రీ అవార్డుల ప్రకటన.. ఇద్దరు తెలుగు వ్యక్తులకు పురస్కారం.. ఎవరెవరంటే?

Padma Awards 2026: గణతంత్ర దినోత్సవ (Republic Day 2026) వేడుకలకు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను (Padma Awards 2026) ఆదివారం (జనవరి 25) ప్రకటించింది. 45 మందికి అవార్డులు దక్కాయి. వారివారి రంగాలలో సుదీర్ఘకాలంపాటు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలకు వారిని కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన వారిలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. పురస్కారానికి ఎంపికైన వారిలో ఎక్కువమంది కొన్ని దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. వైద్యం, విద్య, ఉపాధి కల్పన, పారిశుద్ధ్యం, పర్యావరణ సుస్థిరత, సాంప్రదాయక కళలు, వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో సేవలు అందించినవారు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

తెలంగాణకు చెందిన ఇద్దరు

తెలంగాణకు చెందిన డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌, రామారెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. సీసీఎంబీ శాస్త్రవేత్త అయిన కుమారస్వామి మానవ పరిణామ క్రమంతో పాటు జన్యుపరమైన వ్యాధులపై పరిశోధనలు నిర్వహించారు. రామారెడ్డి పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డ్ వరించింది.

Read Also- Eco Tourism: సోమశిల సౌందర్యం తెలంగాణ పర్యాటకానికి మణిహారం: మంత్రి జూపల్లి కృష్ణారావు

కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం గ్రహీతల లిస్ట్ ఇదే

1. అంకె గౌడ, 2. అర్మిదా ఫెర్నాండెజ్, 3. భగవాన్‌దాస్ రైక్వార్, 4. భిక్ల్యా లడక్యా ధిండా, 5. బ్రిజ్ లాల్ భట్, 6. బుధ్రీ తాతి, 7. చరణ్ హెంబ్రం, 8. చిరంజీ లాల్ యాదవ్, 9. ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యా, 10. గఫ్రుద్దీన్ మేవాటి జోగి, 11. హల్లీ వార్, 12. ఇందర్‌జిత్ సింగ్ సిద్ధూ, 13. కె. పజనివేల్, 14. కైలాష్ చంద్ర పంత్, 15. ఖేమ్ రాజ్ సుంద్రియాల్, 16. కొల్లాక్కైల్ దేవకి అమ్మ జి, 17. కుమారసామి తంగరాజ్, 18. మహేంద్ర కుమార్ మిశ్రా, 19. మీర్ హాజీభాయ్ కాసంభాయ్, 20. మోహన్ నగర్, 21. నరేష్ చంద్ర దేవ్ వర్మ, 22. నిలేష్ వినోద్ చంద్ర మాండ్లేవాలా, 23. నూరుద్దీన్ అహ్మద్, 24. ఓతువర్ తిరుత్తణి స్వామినాథన్, 25. పద్మ గుర్మెట్, 26. పోఖిలా లేఖ్తేపి, 27. పున్నియమూర్తి నటేసన్. 28. ఆర్. కృష్ణన్, 29. రఘుపత్ సింగ్, 30. రఘువీర్ తుకారాం ఖేద్కర్, 31. రాజస్థాపతి కాళియప్ప గౌండర్, 32. రామారెడ్డి మామిడి, 33. రామచంద్ర గాడ్బోలే-సునీత గాడ్బోలే, 34. ఎస్‌జీ సుశీలమ్మ, 35. సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్, 36. షఫీ షౌక్, 37. శ్రీరంగ్ దేవాబా లాడ్, 38. శ్యామ్ సుందర్, 39. సీమాంచల్ పాత్రో, 40. సురేష్ హనగవాడి, 41. తాగా రామ్ భీల్, 42. టెచి గుబిన్, 43. తిరువారూర్ భక్తవత్సలం, 44. విశ్వ బంధు, 45. యుమ్నం జాత్రా సింగ్.

Read Also- Hindu youth burned: బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ యువకుడి సజీవ దహనం.. ఎలా చంపేశారంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?