Belt Shops Controversy: గ్రామంలో బెల్టు షాపులు ఉండాల్సిందేనంటూ పట్టు
కోర్పోలు గ్రామసభలో మద్యపాన ప్రియుల హల్‌చల్
బెల్టుషాపులను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మాణం
జోగిపేట, స్వేచ్ఛ: ‘‘బెల్టు షాపులు ఉంటే మీకేం నష్టం… మీ మొగుళ్లను మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. మేం తాగాలంటే వేరే ఊరికివెళ్లి త్రాగాలా… బెల్టుషాపును అడ్డుకుంటే ఊరుకోబోం’’ అంటూ మద్యపాన ప్రియులు మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని చౌటకూరు మండలం కోర్పోలు గ్రామసభలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.
గ్రామంలో కొనసాగుతున్న బెల్టుషాపును రద్దు చేసేందుకుగాను (Belt Shops Controversy) గ్రామ సర్పంచ్ సునీత ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. స్థానిక మహిళలు లేచి ఈ ఊర్లో బెల్టు షాపులు ఉండొద్దని, తమ భర్తలు బాగా తాగి వచ్చి కొడుతున్నారని, తాము కూలీకి వెళ్లి తెచ్చిన డబ్బులను మద్యానికి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులైతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని విచారం వ్యక్తం చేశారు.
Read Also- Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ మళ్లీ వస్తున్నాడు.. ఎప్పుడంటే?
అయితే, మహిళ వాదనతో ఒక్కసారిగా గ్రామంలోని మద్యపాన ప్రియులు దూసుకువచ్చారు. ‘‘త్రాగకుండా మీ మొగుళ్లను కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మేం త్రాగితే నీదేం పోయింది’’ అంటూ మహిళలపై ఆగ్రహన్ని వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో బెల్టుషాపులు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు. గ్రామ సర్పంచ్ సునిత ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ పొద్దున 7 గంటలకే మద్యం త్రాగుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారని, మద్యం తాగి మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, కాబట్టి గ్రామంలో బెల్టుషాపులను నిషేదిస్తున్నట్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో మెజార్టీ ప్రజలు, వార్డు సభ్యులు ఆమోదించారు. గ్రామంలో మద్యం అమ్మినా, సేవించినా జరిమానాలు విధిస్తామని వారు హెచ్చరించారు.
Read also- Davos 2026: ఫ్యూచర్ సిటీలో.. ఏఐ డేటా సెంటర్.. దావోస్‌లో మరో క్రేజీ ఒప్పందం!

