Singareni: సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు..?
Singareni (imagecredit:twitter)
Telangana News, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Singareni: సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు?.. దాచి పెట్టినా దాగని వాస్తవాలు ఏంటి..?

Singareni: కోల్ మాల్ అంటూ నమస్తే తెలంగాణ వార్తల్లో నిజమెంత?
– సైట్ విజిట్ సర్టిఫికేట్ తర్వాత 4 టెండర్ల విడుదల?
– బావమరిదే రింగ్ మాస్టర్ కథనంతో ప్రజలకు మసి పూసే ప్రయత్నం
– హరీశ్ రావు ఆరోపణలకు పస లేదని చెబుతున్న సెంట్రల్?
– సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు?
– ఆనాటి అగ్గిపెట్టెలా ఇప్పుడూ అందరు నమ్ముతారనుకుంటే ఎలా?
– దాచి పెట్టినా దాగని వాస్తవాలు ఏంటి.. హడావుడితో ఉపయోగమేంటి?
– స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనం


ఏ పరిస్థితుల్లో అయినా అగ్గిపెట్టెతో అంటించడం చాలా ఈజీ. పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె ఏది అంటూ ఎంతో మంది ప్రాణాలు తీసే వాళ్లకు ఏనాడూ అగ్గిపెట్టె దొరకదు. పైగా, అందరినీ మేనేజ్ చేశాను అనుకుంటూ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు నైనీ బొగ్గు టెండర్స్‌కు లింకు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం బట్టబయలు అవుతున్నది. సొంత పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ మంగళవారం పెట్టిన టైటిల్‌, రాసిన స్టోరీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడు ఏం జరిగిందో, ఈనాడు ఏం చేస్తున్నారో తెలిసీ తెలియకుండా ఎలా రాస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్ రెడ్డి వివరణతోనైనా అగ్గిపెట్టె వ్యవహారాన్ని మానుకుని అగ్గి లాంటి నిజాన్ని తెలుసుకుని, అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించే తీరు ఉండొద్దని సోషల్ మీడియా కోడై కూస్తున్నది.

మీ హయాంలో జరిగింది ఇదే?

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డిపై నైనీ టెండర్స్‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరోపణలు చేశారు. ఆ వెంటనే సైట్ విజిట్ సర్టిఫికెట్లతో దందా అంటూ నమస్తే తెలంగాణలో వార్తలు రాశారు. దీనిపై ‘స్వేచ్ఛ’ సవాల్ విసురుతున్నది. సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన కేవలం తెలంగాణలోనే ఉన్నదా? సింగరేణి టెండర్ల అసలు సిసలు వాస్తవాలు తెలుసుకోకుండా అనుభవం ఉన్న పత్రిక, మాజీ మంత్రులు ఏదిబడితే అది ఎలా మాట్లాడుతున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


అగ్గిపెట్టె హరీశ్ రావు ఆరోపణ:
సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌ రెడ్డికి టెండర్ కట్టబెట్టడానికే సైట్ విజిట్‌ నిబంధన తెచ్చారు
నిజం:
ఈ నిబంధన కింద 2023కు ముందు బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన కంపెనీలే టెండర్లు దక్కించుకున్నాయి.

టెండర్ 1
వీకేఓసీ -1, కొత్తగూడెం

– పాల్గొన్న బిడ్డర్లు: సుమారు 7 సంస్థలు
– అందరికీ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనుమతి
– కాంట్రాక్ట్ పొందిన సంస్థ: సోధా కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
– కంపెనీ ఎండీ దీప్తి రెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కండాల ఉపేందర్ రెడ్డి కుమార్తె
– ఇదే కంపెనీకి పక్కనే ఉన్న వీకేఓసీ -2 ప్రాజెక్ట్‌ను 2023 నవంబరులో 10% అధిక రేటుతో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేటాయించారు. ఈ కంపెనీనే సృజన్‌ రెడ్డిది అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్‌ఎస్ హయాంలో ఈ కంపెనీకే వీకేఓసీ -2 ప్రాజెక్టును ఎలా కేటాయించారు.

టెండర్ 2
కళ్యాణ ఖని ఓపెన్‌ కాస్ట్ ప్రాజెక్ట్, మందమర్రి

– పాల్గొన్న బిడ్డర్లు: సుమారు 12 మంది
– అందరికీ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనుమతి
– కాంట్రాక్ట్ పొందిన సంస్థ: ఎక్స్‌ప్రెస్‌వే ఆర్‌వీఎస్ఆర్ జేవీ
– ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కోమండ్ల దీక్షిత్‌ రావు, ఈయన ప్రతిమ శ్రీనివాస్ రావు, వినోద్ రావు(మాజీ ఎంపీ) మేనల్లుడు. ఈ సంస్థ కూడా ప్రతిమ గ్రూప్‌కు చెందినదే.

టెండర్ 3
ఆర్‌జీ ఓసీ -2 ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్

– పాల్గొన్న బిడ్డర్లు: 6 మంది
– అందరికీ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనుమతి
– కాంట్రాక్ట్ పొందిన సంస్థ: సీ5 ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
– డైరెక్టర్లు: నిశాంత్ రావు, మదన్ మోహన్ రావు
– నిశాంత్ రావు, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు కుమారుడు. కేసీఆర్‌, హరీశ్ రావుకు సుధాకర్ రావు బంధువు.

టెండర్ 4
ఎస్‌ఆర్‌పీ – ఓసీ -2 ప్రాజెక్ట్

– పాల్గొన్న బిడ్డర్లు: 12 మంది
– అందరికీ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనుమతి
– మరింత మంది పాల్గొనడానికి టెండర్ గడువు 2 రోజుల పొడిగింపు
– కాంట్రాక్ట్ పొందిన సంస్థ: హర్షా కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
– ఈ సంస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్వహించింది. ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావుకు భారీగా లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్నది. ఈ కంపెనీ యజమానులు హరీశ్ రావుకు సన్నిహితులే.

Also Read: Godavari Pushkaralu 2026: కృష్ణా, గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. ఎప్పుడంటే..?

అన్నీ బీఆర్ఎస్ సన్నిహితులకే..

ఈ నాలుగు టెండర్లు ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ నిరాకరించలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అన్ని టెండర్లలో సజావుగా జరుపుకున్నారు. ప్రతి టెండర్‌లో 6 నుంచి 12 మంది పాల్గొన్నారు. బిడ్డింగ్‌లో పాల్గొన్న వారి సంఖ్య పెంచడానికి టెండర్ గడువు పొడిగించారు. సింగరేణి టెండర్స్ అన్నీ బీఆర్ఎస్ నేతల సన్నిహితులకే దక్కాయి. భారీగా లాభాలు కూడా ఆర్జించారు. ఈ టెండర్లన్నీ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడ్డాయి. ఎక్కడా 6 మందికి తక్కువగా పాల్గొనలేదు. కాంట్రాక్టులపై ఏ బిడ్డరూ అభ్యంతరం తెలుపలేదు. ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల ఫలితాలను మార్చాలని చూసి ఉంటే, బీఆర్‌ఎస్ నేతలకు చెందిన సంస్థలకే ఈ కాంట్రాక్టులన్నీ ఎలా దక్కుతాయి, ఒక్క కంపెనీకి కూడా వచ్చి ఉండేదే కాదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నైనీ పైనే గొడవ ఎందుకు?

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో ఒడిశాకు చెందిన 626 హెక్టార్ల బొగ్గు గనిపై అందరి కన్ను పడింది. నాణ్యమైన బొగ్గు దొరికే ఈ ఏరియాను దక్కించుకుంటే మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. సింగరేణి భారీ టెండర్ దక్కించుకుంటే అనేక ఉపయోగాలు ఉన్నాయని వివిధ కంపెనీలు అనుకుంటున్నాయి. దీంతో సింగరేణికి కేటాయించిన వెయ్యి ఎకరాలకు పైగా మైనింగ్‌లో అందరూ భాగస్వామి కావాలని మైనింగ్ మాఫియా కోరుకుంటున్నది. అందుకే ఇంతలా ప్రయత్నాలు చేస్తున్నది. చివరికి మంత్రి, ఐఏఎస్ అంటూ ఓ ఛానల్ వార్తలు వడ్డించింది. దానికి కౌంటర్‌గా తొలి పలుకు అంటూ కమ్మగా డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటో వేసి వార్త రాసినా కేసులు లేని వారికి లాభదాయకంగా మారిందని తెలుస్తున్నది. అందుకే నైనీపై అందరూ ఆశలు పెంచుకున్నారు.

సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలు ఏఏ రాష్ట్రాల్లో ఉన్నాయి?

బిడ్డర్లకు సైట్ విజిట్ / సైట్ ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్లను దేశంలోని చాలా ప్రభుత్వ సంస్థలు తప్పనిసరి చేశాయి.
కేరళ – పీడబ్ల్యూడీ, సాగునీటి, భవన నిర్మాణ పనులు,
తమిళనాడు – పీడబ్ల్యూడీ, హైవేస్, ట్యాంగెడ్కో
కర్ణాటక – పీడబ్ల్యూడీ, మైనర్ ఇరిగేషన్, నగర పాలక సంస్థలు
తెలంగాణ – ఇంజినీరింగ్, మౌలిక సదుపాయ ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ – సాగునీటి, నిర్మాణ పనులు
ఒడిశా – గ్రామీణ అభివృద్ధి శాఖ
పశ్చిమ బెంగాల్ – పీడబ్ల్యూడీ, మునిసిపల్ పనులు
మహారాష్ట్ర – జెడ్పీ, పీడబ్ల్యూడీ, ఎంఐడీసీ
రాజస్థాన్ – పీహెచ్‌ఈడీ, పీడబ్ల్యూడీ, సాగునీటి పనులు
ఉత్తరప్రదేశ్ – ప్రత్యేక ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వం, పీఎస్‌యూ సంస్థలు – సీపీడబ్ల్యూడీ, భారతీయ రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌బీసీసీ, ఎన్‌పీసీసీ, విద్యుత్ పీఎస్‌యూ, ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, బీహెచ్‌ఈఎల్, పీజీసీఐఎల్
ఆయిల్ & గ్యాస్ పీఎస్‌యూలు – ఓఎన్‌జీసీ, జీఏఐఎల్, ఐఓసీఎల్.

Also Read: Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!

సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉద్దేశం

భూస్థితులు తెలుసుకోవాలి. పనిలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవాలి. దాంతో మైనింగ్‌లో తలెత్తే సమస్యలు ఎంటి? వాస్తవిక ధరలు ఎలా నిర్ణయించుకోవాలి. పారదర్శకతతో ఎలా ఉండాలి అని బిడ్డర్లు ప్రాజెక్ట్ పరిస్థితులను అర్థం చేసుకుంటారు.

నమస్తే.. జర చూసుకొని రాసుకో?

కాంట్రాక్ట్ పొందిన సంస్థలన్నీ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. గత ప్రభుత్వ కాలంలో హరీశ్ రావుతో భారీగా లబ్ది పొందిన వారే ఉన్నారు. లాభాలు చేసుకున్నారు. మీరు చెప్పే నిబంధనను కొంతమందికి లాభం చేకూర్చేందుకు తీసుకొచ్చారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, పోటీగా జరుగుతుంది. ఇప్పటికైనా అగ్గిపెట్టె వ్యవహారాలు మానుకోవాలి. లేదంటే అన్ని టెండర్స్‌లో సీబీఐ దర్యాప్తు కోసం సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన బొగ్గు గనుల మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

పదేండ్ల బీఆర్ఎస్ కాలంలో..

పదేండ్లు వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. చాలా ప్రాజెక్టులు పాజిటివ్ రేట్లకే కేటాయించారు. ఇతర రాష్ట్రాల్లో అయితే ఇదే తరహా పనులు భారీ నెగిటివ్ రేట్లకు కేటాయించబడ్డాయి. అప్పటి టెండర్లలో అవకతవకలు జరిగాయి. ఇప్పటి ప్రభుత్వం వాటర్, సింగరేణి టెండర్స్‌కు సంబంధించి విచారణ సీబీఐకి ఇవ్వాలి. అప్పుల ఊబిలో సింగరేణి కాదు, దానికి కారణం బీఆర్ఎస్‌యే అని ‘స్వేచ్ఛ’ ఎడిటర్ దేవేందర్ రెడ్డి నిరూపిస్తారు. మీరు సిద్ధమా?

Also Read: Uttam Kumar Reddy: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Just In

01

Phone Tapping Case: నేను ఏ తప్పు చేయలే.. విచారణకు భయపడను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Naini Coal: సింగరేణిలో అవకతవకలు.. బీఆర్ఎస్ పాలనలో అసలు ఏం జరిగింది?

Davos 2026: సీఎం రేవంత్ దావోస్ టూర్ విజయవంతం.. 3 రోజుల్లో రూ.30వేల కోట్లు!

Electricity Department: విద్యుత్ శాఖలో బదిలీల చిచ్చు.. ఆర్టీజన్లకు నో.. రెగ్యులర్లకే జై!

Phone Tapping Case: త్వరలో కేసీఆర్‌‌కు నోటీసులు? గులాబీ నేతల్లో  సిట్ తీరుపై చర్చ!