Godavari Pushkaralu 2026: తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. వచ్చే ఏడాది జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో నిర్వహించిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లకు సిద్ధమైంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సైతం సిద్ధం చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతుంది. కుంభమేళాతో పనులు చేసిన ఎర్నెస్ట్ యంగ్(ఈవై) కన్సల్టెన్సీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ పనుల పర్యవేక్షణకోసం దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Sureka) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండనున్నట్లు సమాచారం. ఇందులో చివరగా ఒకరిద్దరి మార్పులు ఉంటే మంత్రు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చోటు కల్పించే అవకాశం ఉండొచ్చనేది సమాచారం.
Also Read: Saroor Nagar Lake: సరూర్ నగర్ చెరువుపై.. హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే ఛాన్స్
ఇప్పటికే గోదావరి, కృష్ణా పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దేవాదాయ, టూరిజం, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ప్రయాగా రాజ్‌కు వెళ్లి మహాకుంభమేళాకు అక్కడ అనుసరించిన విధానాలను అధ్యయనం చేశారు. పుష్కరాల్లో కీలకమైన పుణ్య స్నానాలకు రాష్ట్రవ్యాప్తంగా నదీతీరం వెంబడి ఉన్న పుష్కర ఘాట్లను ఆధునికీకరించడంతో పాటు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు. అలాగే ఆయా ఆలయాల ప్రాంతాల్లో భక్తుల తాకిడికి తగ్గట్లుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అందుకోసం నిత్యం పర్యవేక్షణ కోసమే క్యాబినెట్ సబ్ కమిటీ వేయబోతున్నట్లు తెలిసింది. పుష్కర ఘాట్లు, అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలు, భక్తుల కోసం డ్రెస్ చేంజ్ రూమ్స్, మరుగుదొడ్లు, తాగు నీటి సదుపాయాలు కల్పన, రోడ్ల సదుపాయంతో పాటు నదీ తీరాల వెంబడి బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉండగా.. 70 ఘాట్లు గుర్తించింది. వీటిని మూడు కేటగిరీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. గోదావరి పుష్కర ఘాట్ ఉండి, దాని సమీపంలోనే ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రాంతాలను కేటగిరీ-1గా, ఘాట్లు ఉండి, ఆలయాలు కాస్త దూరంగా ఉన్న ప్రాంతాలు కేటగిరీ-2లో, కేవలం స్నానాలకు అనుకూలంగా ఉండి, ఘాట్లు మాత్రమే ఉన్న ప్రాంతాలను కేటగిరీ-3గా గుర్తించారు. ప్రస్తుతం గుర్తించిన ఘాట్ల పరిధిలో 65 ఆలయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read: KCR: సిట్ విచారణ వివరాలపై ఆరా తీసిన గులాబీ బాస్ కేసీఆర్..భయపడోద్దంటూ..?

