Uttam Kumar Reddy: ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
Uttam Kumar Reddy (imagecredit:swetcha)
Telangana News

Uttam Kumar Reddy: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై తరచుగా సమీక్షించుకుని పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం సచివాలయంలో నీటిపారుదల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం టన్నెల్‌లో రైలు ట్రాక్ సాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టుల పనులలో నిబంధనలు పాటిస్తూనే నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి సరిపడా నిధుల కేటాయింపును సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని, యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. నిర్మాణాల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నిర్మించ తలపెట్టిన బ్యారేజ్‌కు సంబంధించిన డీపీఆర్ తయారీ కోసం పూర్తి స్థాయిలో సర్వేలు, పరిశోధనలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. బ్యారేజ్ ప్రాంతంలో అవసరమైన 73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టోపో గ్రాఫికల్ సర్వే పూర్తి అయ్యిందని, దాంతో పాటు 85 కిలోమీటర్ల కాలువ సర్వేను కూడా పూర్తి చేశామన్నారు. అదనంగా వార్ద, వైన్ గంగా నదులకు ఇరు వైపులా క్రాస్-సెక్షన్ లెవల్స్ సర్వే పూర్తి అయినందున డీపీఆర్‌లకు తుది రూపం ఇచ్చేందుకు కసరత్తు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. జైళ్ల శాఖలో ఇద్దరు అధికారులకు ప్రమోషన్లు

అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల వద్ద పరిశీలన పనులు

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్‌లకు సంబంధించిన పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లపై సైట్ తనిఖీ నివేదికతో పాటు పనులకు సంబంధించిన ప్రణాళికలు సమర్పించిందని వివరించారు. బుధవారం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అధ్యయనం ప్రారంభించగా మరో ఇద్దరు సభ్యులు బోర్ హోల్ ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల వద్ద పరిశీలన పనులు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ మూడు బ్యారేజ్‌ల పునరుద్ధరణ డిజైన్లు నెల వ్యవధిలో రూపొందించాలని అధికారులకు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందేందుకు మరింత ఒత్తిడిని పెంచాలన్నారు. పర్యావరణ అనుమతులకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను వివరించారు. కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చామని, ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత పీఎం మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

పూడికతీత పనులకు శ్రీకారం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో మట్టి, ఇసుక మెటలుతో పుడుకు పోయాయని దానితో నీటి నిలువ సామర్ధ్యం తగ్గిపోతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ వరుసగా సంభవిస్తున్న వరదలతో మట్టి, ఇసుక వచ్చి చేరడంతో 112 టీఎంసీ సామర్థ్యం నుంచి 90 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు వివరించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Also Read: YS Jagan: భూముల రీసర్వే రగడ.. పెద్ద మనిషి అంటూనే.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు!

Just In

01

Phone Tapping Case: నేను ఏ తప్పు చేయలే.. విచారణకు భయపడను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Naini Coal: సింగరేణిలో అవకతవకలు.. బీఆర్ఎస్ పాలనలో అసలు ఏం జరిగింది?

Davos 2026: సీఎం రేవంత్ దావోస్ టూర్ విజయవంతం.. 3 రోజుల్లో రూ.30వేల కోట్లు!

Electricity Department: విద్యుత్ శాఖలో బదిలీల చిచ్చు.. ఆర్టీజన్లకు నో.. రెగ్యులర్లకే జై!

Phone Tapping Case: త్వరలో కేసీఆర్‌‌కు నోటీసులు? గులాబీ నేతల్లో  సిట్ తీరుపై చర్చ!