Medchal Crime: గుండ్లపోచంపల్లి సర్కిల్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో బుధవారం రాత్రి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్(Medhal) పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గౌడవెల్లి(Goudavelli)లోని హనుమాన్ ఆలయం సమీపంలో నివసిస్తున్న గోమారం లక్ష్మారెడ్డి(Gomaram Lakshmareddy) (42), వృత్తిరీత్యా పెయింటర్, తలపై తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
గోర్రెల కాపరీ అయిన..
ప్రాథమిక దర్యాప్తులో, మృతుడు లక్ష్మారెడ్డి తన ఇంట్లో అద్దెకుంటున్న మలిగ లింగం (50), వృత్తిరీత్యా గొర్రెల కాపరితో కలిసి బుధవారం రాత్రి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసినట్లు తెలిపారు. గొడవ తీవ్రత పెరగడంతో నిందితుడు మలిగ లింగం(Maliga Lingam) గొడ్డలితో లక్ష్మారెడ్డి(Laxama Rddy) తలపై దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన లక్ష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
Also Read: Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!

