Municipal Elections: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ కౌన్సిలర్
అదే బాటలో మరికొందరు…?
నాగర్‌కర్నూల్, స్వేచ్ఛ: మునిసిపల్ ఎన్నికలు-2026కు (Municipal Elections) కొన్ని వారాల ముందు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి (BRS) బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికలవేళ ఆ పార్టీ నుంచి ఇద్దరు మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మాజీ కౌన్సిలర్ ఖాజా ఖాన్, బాదం రమేశ్, ఇసాక్, మోతికుమార్, మరో కౌన్సిలర్ భర్త బీఆర్ఎస్ నేత తిరుమల్ యాదవ్, పడిగె శంకర్, ఇమ్రాన్ ఖాన్ హస్తం పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Read Also- Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!
కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొందరు మాజీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లతో పాటు వార్డుల వారీగా ముఖ్య నాయకులు టచ్‌లో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి ఈ చేరికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో ఆశావాహులు అధిక సంఖ్యలో ఉన్నారు. మారిన రిజర్వేషన్లతో చాలామంది సిటింగ్ స్థానాలను కోల్పోగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీలో ఉన్న తమకు కొత్తగా వచ్చి చేరే బీఆర్ఎస్ నాయకుల వల్ల రాజకీయ అస్థిరత ఏర్పడుతుందనే ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
Read Also- Tollywood Crisis: అందుకే సినిమాలు చూడలేకపోతున్నా.. ప్రముఖ నిర్మాత.. నీళ్లు కూడా దొరకవు..

