Medchal News: మేడ్చల్ సర్కిల్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో ఉన్న సామూహిక అంబేద్కర్ భవనానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది. 1973లో అప్పటి పాలకులు దళితుల సంక్షేమం కోసం అంబేద్కర్ భవన(Ambedkar Bhavan) నిర్మాణానికి మొత్తం 345 గజాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం 1997లో దళితుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణ కోసం 80 గజాల విస్తీర్ణంలో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ్(Minister Devender Goud) ప్రారంభించారు. అప్పటి నుంచి మండలంలోని దళితులు ఈ భవనాన్ని సమావేశాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించుకుంటున్నారు. భవనం నిర్మాణం అనంతరం మిగిలిన స్థలాన్ని కూడా కాలనీవాసులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఉపయోగించుకుంటూ వస్తున్నారు.
Also Read: Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో
కబ్జా చేయడం అన్యాయం
ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలం తమదేనని చెబుతూ జెసిబి(JCB) సహాయంతో కబ్జా చేయడానికి యత్నించగా, కాలనీవాసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, చివరకు కబ్జా యత్నం విఫలమైంది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు తక్షణమే స్పందించి భూమిని కాపాడాలని, కబ్జాకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు జీడిపల్లి శివ, రామకృష్ణ, యాదగిరి, లక్ష్మణ్, రావల్కోల్ మహేష్, నల్లవల్లి శ్రీను, మైపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad GCC: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు తమ సంస్థ సానుకూలం: విల్లెమ్ ఉయిజెన్

