RTC Officer Died: గుండెపోటుతో ఆదివారం చనిపోయిన ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు..
నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డి
హాజరైన రోడ్ రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్
డీఎం, డీవీఎంల హాజరు.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు సైతం హాజరు
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన జూబ్లీ బస్ డిపో డిప్యూటీ జనరల్ మేనేజర్ కొత్త వెంకట్ రెడ్డి అంత్యక్రియులు (RTC Officer Died) సోమవారం నాడు ముగిశాయి. ఆప్తులు, బంధువుల అశ్రునయనాలమధ్య అంత్యక్రియలను నిర్వహించారు. వెంకట్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. మల్కాజిగిరి స్మశాన వాటికలో సోమవారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వెంకట్ రెడ్డికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పాడె సైతం మోశారు. అంతిమక్రియల్లో భారీ సంఖ్యలో ఆర్‌టీసీ అధికారులు, కార్మికులు, కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, డీఎం కవిత, డీవీఎంలు, అధికారులు తదితరులు హాజరయ్యారు. పూలమాలలతో వెంకటరెడ్డి మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
Read Also- Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్
ప్రైవేటు హాస్పిటల్‌లో మృతి
ఆర్టీసీ జూబ్లీ బస్‌స్టేషన్ డిపో డిప్యూటీ జనరల్ మేనేజర్ కొత్త వెంకట్ రెడ్డి (60) ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త వెంకట్ రెడ్డి గతంలో మెదక్, సంగారెడ్డి ఆర్టీసీ డిపోల్లో విధులు నిర్వహించారు. మృతుడికి భార్య మంజులతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏప్రిల్ నెలలో వెంకట్ రెడ్డి రిటైర్మెంట్ కావాల్సి ఉంది. వారం రోజుల క్రితం వెంకట రెడ్డి కి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు. వెంకట్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డి రెడ్డి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మిక విభాగం నేతలు రాధాకిషన్ రావు, పీఎస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Read Also- Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

