Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్..
Contractor working on Substandard Bridge Construction Raises Concerns in Sirgapur
మెదక్, లేటెస్ట్ న్యూస్

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

నారాయణఖేడ్, స్వేచ్ఛ: సిర్గాపూర్ మండలం పొట్పల్లి గ్రామ శివారులో వాగుపై నిర్మిస్తున్న హేవీ బ్రిడ్జ్ పనుల్లో నాసిరకం స్టీల్ వినియోగిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ పునాదులు, పిల్లర్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్న స్టీల్ తుప్పు పట్టినట్లుగా కనిపించడం, అవసరమైన గ్రేడ్‌ (IS స్టాండర్డ్) స్టీల్ వాడటం, డస్ట్, సిమెంట్ 43 గ్రేడ్ వాడటం ఆరోపణలు ఉన్నాయి.

నాణ్యత ఇంత తక్కువగా ఉండడంతో వంతెన పటిష్టతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వర్షాకాలంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించే ప్రాంతంలో కీలకమైన వంతెన నిర్మాణంలో నాసిరకం సామగ్రి వాడితే భవిష్యత్తులో ప్రమాదాలకు దారి తీయవచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికే పునాదుల్లోకి నీరు చేరుతుండటంతో మోటార్లతో నీటిని బయటకు పంపిస్తూ పనులు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో సరైన నాణ్యత నియంత్రణ లేకపోతే నిర్మాణం బలహీనంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగిస్తున్న స్టీల్, కాంక్రీటు, సిమెంట్, డస్ట్‌తో బ్రిడ్జి నిర్మిస్తున్నారని, నమూనాలను తక్షణమే టెస్టులకు పంపించి, నాణ్యత నివేదికలను ప్రజలకు వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also- BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!