Elon Musk | ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. టెక్నాలజీ యుగంలో సెన్సేషనల్ గా ఉన్న AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కంపెనీని కొంటానని 97.4 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియా కరెన్సీలో ఏకంగా రూ.8.5లక్షల కోట్ల ఆఫర్ చేశారు. ఏఐ కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్ మన్ కు ఈ ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. వాస్తవానికి ఎలన్ మస్క్ (Elon Musk) మొదట్లో ఏఐ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తర్వాత దాని నుంచి 2018లో బయటకు వచ్చారు. అప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ కంపెనీలో పెట్టుబడులు పెడుతోంది. దాంతో అగ్రిమెంట్ ను ఉల్లంఘించారంటూ ఎలన్ మస్క్ మైక్రోసాఫ్ట్, ఏఐ కంపెనీలపై దావా కూడా వేశారు.
కానీ ఏఐ ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏఐ కు ఆదరణ విపరీతంగా పెరిగింది. అందుకే ఎలన్ మస్క్ ఈ ఆఫర్ చేశారు. కాగా ఈ విషయంపై శాల్ ఆల్ట్ మన్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఎలన్ మస్క్ ఆఫర్ ను తిరస్కరించారు. మీరు కోరుకుంటే ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) ను 9.74 బిలియన్ డాలర్లకు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.85వేల కోట్లకు కొనుగోలు చేస్తామంటూ శామ్ ఆల్ట్ మన్ ప్రకటించారు. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ.. మోసగాడు అంటూ విమర్శించారు. దాంతో ఈ వ్యాపార దిగ్గజాల ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.