Medchal News: 2 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు
Medchal News (imagecredit:swetcha)
రంగారెడ్డి, హైదరాబాద్

Medchal News: మేడ్చల్లో 2 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు

Medchal News: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) స్పష్టం చేశారు. సోమవారం ముడిచింతలపల్లిలో నూతన ఎమ్మార్వో కార్యాలయాన్ని ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender), స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy), డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఇక ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు.\

Also Read: Bhatti Vikramarka: ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు.. రాధాకృష్ణపై భట్టి విక్రమార్క ఫైర్!

మొత్తం 2 కోట్ల 9 లక్షల నిధులతో..

ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సంక్షేమమే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అంతకు ముందు పొన్నాల, అడ్రస్ పల్లి, జగన్ గూడ, ఉద్దెమర్రి గ్రామంలో మొత్తం 2 కోట్ల 9 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏ-బ్లాక్ అధ్యక్షుడు వేణు గోపాల్ రెడ్డి, ముడిచింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, గోన మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read: PM Modi: చొరబాటుదారులకు భూములా.. కలియాబోర్ సభలో ప్రధాని మోదీ నిప్పులు..?

Just In

01

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!

MP Chamal Kiran: దావోస్‌ ‘వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్’ వేదికపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

C-Mitra: సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’.. 10 రోజుల్లో 1000 కాల్స్.. 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు

Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?