GHMC: 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. విభజన తర్వాతే
GHMC ( IMAGE CREDIT: twitter)
హైదరాబాద్

GHMC: 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. విభజన తర్వాతే వార్డుల రిజర్వేషన్లు!

GHMC: జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారా అనే సస్పెన్స్‌కు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తెర దించారు. ఆయన మీడియా చిట్ చాట్‌లో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేసిన మున్సిపల్ శాఖ పనిలో పనిగా జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ సీటును సైతం మహిళ జనరల్ క్యాటగిరీ కింద రిజర్వ్ చేసిందని, కొత్తగా ఏర్పడిన 300 మున్సిపల్ డివిజన్ల రిజర్వేషన్లు ఇప్పట్లో ప్రకటించే అవకాశాల్లేవని అన్నారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు.. కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ? 

రిజర్వేషన్లను ఖరారు చేస్తాం

ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుతం ఉన్న పాలక మండలి అధికార గడువు ముగిసిన వెంటనే, వీలైతే 11వ తేదీన జీహెచ్ఎంసీ (GHMC) పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శంషాబాద్ వరకు విస్తరించి ఉన్న పరిధి 150 డివిజన్ల వరకు ఫిక్స్ చేసి, మిగిలిన 150 మున్సిపల్ వార్డులను రెండు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత రిజర్వేషన్లను ఖరారు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ప్రస్తుత పరిధి మూడు జిల్లాలుగా, మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా, మూడు పోలీస్ కమిషనరేట్లుగా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు వివరించిన ఆయన, జిల్లా విషయంలో క్లారిటీ ఇంకా రాలేదని వ్యాఖ్యానించారు.

పెద్దన్న పాత్ర పోషించనున్న జీహెచ్ఎంసీ

ఫిబ్రవరి 10 తర్వాత మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన జరిగినా, 150 డివిజన్లతో కొనసాగనున్న జీహెచ్ఎంసీ, మిగిలిన రెండు కొత్త కార్పొరేషన్లపై పెద్దన్న పాత్రను పోషించనున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడనున్న రెండు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా ఇప్పటికే అదనపు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. వచ్చే నెల 11న సర్కారు ఉత్తర్వులు జారీ..!

Just In

01

AV Ranganath: చెరువుల్లో మట్టి వేసి కబ్జాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక!

Medak District: ఆ జిల్లాలో అమావాస్య వేడుకలకు సిద్ధం.. పుణ్యస్నానం ఏడుపాయలకు రానున్న లక్షలాది మంది భక్తులు!

Collector Hanumantha Rao: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.. అధికారులకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు!

Seethakka: మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క!

Uttam Kumar Reddy: మున్నేరు, పాలేరుకు రూ.162.57 కోట్లు.. ఆకస్మిక వరదలతో జరిగే నష్టాలకు చెక్!