Challa Narasimha Reddy: గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేసే ఆలోచన మోడీ, షాలది
-గాంధీ పేరు మార్పు విషయంలో కేంద్రం వెనకి తగ్గాలి
-ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు
-కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టే విధంగా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి(Challa Narasimha Reddy) అన్నారు. వీబీ జీ రామ్జీ వొద్దు.. ఎంజీఎస్ఆర్డీఏ చట్టం ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పేదల జీవన స్థితిగతులను మెరుగు పర్చేందుకు ఆ నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలోని పేదలు పట్టణ ప్రాంతాలకు వలసలు వెల్లొద్దని.. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంచే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాడం జరిగిందన్నారు.
Also Read: Khammam News: ఖమ్మం జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. ఈసారి మేయర్ పదవి మళ్లీ..?
గ్రామీణ ప్రాంతాల్లో నిరసన
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ(BJP) ప్రభుత్వానికి.. కార్పొరేట్ శక్తుల బాగోగులు తప్ప పేదల ప్రజల కష్టాలు పట్టవన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యంలో చేసే కుట్రలో భాగంగా.. పార్లమెంట్లో ఎంజీఎస్ఆర్డీఏ చట్టాన్ని మార్పులు చేస్తూ.. పేరు మార్చుతూ.. నిధులు విషయంలో 40 శాతం రాష్ట్రాల మీద నెట్టివేసిందన్నారు. దీంతో ఈ చట్టం భవిష్యత్లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనిపై పోరాటం చేసేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20 నుంచి 1 వరకు గ్రామీణ ప్రాంతాల్లో నిరసన తెలుపుతూ.. ప్రజలు అవగాహన కల్పిస్తూ భవిష్యత్ పోరాటలకు చైతన్యం చేస్తామన్నారు. రాంరెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఆలోచన చేసింది కాంగ్రెస్ మాత్రమే.. బీజేపీ ప్రభుత్వాన్నికి ఆదాని, అంబానీలను అందెలం ఎక్కించడం తప్ప మరో పనిలేదన్నారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు మార్చినంత మాత్రాన.. దేశంలో గాంధీని కమమర్లు చేసే అంత దమ్ము బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎస్ఆర్డీఏ చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
Also Read: Jagga Reddy: జగ్గారెడ్డికి ఏమైంది ఇలాంటి శపథం చేశారు?.. అన్నంత పనిచేస్తారా ఏంటి?

