Khammam News: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, డివిజన్ కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్‌ల రిజర్వేషన్‌లను అధికారులు ఖరారు చేసారు. మొత్తం మున్సిపాలిటీల్లో బీసీ(BC)లకు1 ఎస్(SC)సీలకు 1 ఎస్టీలకు1 కేటాయిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి ఖమ్మం(Khammam)లో మున్సిపల్ రిజర్వేషన్లు, జిల్లాలోని మున్సిపాలిటీలు, డివిజన్‌లు వార్డుల్లో 38స్థానాలు (31.4%) బీసీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవి మళ్లీ జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడి 60 డివిజన్‌లలో ఒకటి ఎస్టీ(ST), ఎస్(SC)సీలకు 07, బి.సీలకు 20 కేటాయించగా, 32 డివిజన్‌లు అన్ రిజర్వు డ్ కేటగిరి కింద కేటాయించారు.
మొత్తం 60 డివిజన్లలో..
కొత్తగూడెం కార్పొరేషన్‌లోని (కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచలతో కూడిన )కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ(ST) జనరల్ కు కేటాయించగా, ఇక్కడి మొత్తం 60 డివిజన్లలో 30 జనరల్, బీసీలకు 7, ఎస్టిలకు 11, ఎస్సీలకు 12 రిజర్వుడ్ అయ్యాయి. ఏదులాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించగా, 32 డివిజన్ లలో ST – 3, SC – 7, BC – 6 UR కు -16 కేటాయించారు. కల్లూరు మున్సిపాలిటి ఛైర్మన్ పదవి ST జనరల్ కు కేటాయించారు.
Also Read: Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!
కల్లూరు వార్డ్ రిజర్వేషన్ల వివరాలిలా..
1వ వార్డు OC w, 2వ వార్డు SC G, 3వ వార్డు SC G, 4వ వార్డు ST G, 5వ వార్డు OC w, 6వ వార్డు ST w, 7వ వార్డు ST G, 8వ వార్డు OC G, 9వ వార్డు OC w, 10వ వార్డు OC G, 11వ వార్డు BC w, 12వ వార్డు BC G, 13వ వార్డు OC w, 14వ వార్డు OC w, 15వ వార్డు OC w, 16వవార్డు SC G, 17వ వార్డు SC w, 18వ వార్డు OC G, 19వ వార్డు SC w, 20 వార్డు OC G కు కేటాయించారు. మధిర మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి జనరల్ మహిళ కు కేటాయించారు. ఇక్కడ వార్డు లు ST 1, SC 6, BC 4, UR 11 కార్పొరేటర్ల లకు కేటాయించారు. సత్తుపల్లి(Sathupally) మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ వార్డు కౌన్సిలర్ పోస్టులు ST 1, SC 3, BC 7, UR 12 కేటాయించారు. వైరా మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ ST 1, SC 5, BC 4, UR 11వార్డులు కేటాయించారు. అశ్వరావుపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ ఎస్టీలకు 3, ఎస్సీ లకు 4, బి.సి లకు 4 కేటాయించగా 11వార్డులు అన్ రిజర్వు డ్ కేటగిరిలో ఉంచారు. ఇల్లెందు మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి బి.సి. మహిళకు కేటాయించారు. ఎస్టీ లకు 2, ఎస్సీ లకు 4, బి.సి లకు 6, అన్ రిజర్వు డ్ కేటగిరిలో 12 వార్డులు ఖరారు చేశారు.
Also Read: Secunderabad Issue: వచ్చేది మేమే.. సికింద్రాబాద్‌ను జిల్లా చేస్తాం.. కేటీఆర్ కీలక ప్రకటన

