Teachers Tragedy: ఉపాధ్యాయుల కారుకు ఘోర రోడ్డు ప్రమాదం
Teachers Tragedy (imagecredit:sqwetcha)
క్రైమ్, నల్గొండ

Teachers Tragedy: ఉపాధ్యాయుల కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి..!

Teachers Tragedy: సంక్రాంతి సెలవులు అయిపోయాయి. యధావిధిగా పాఠశాలలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా పాఠశాలలకు హాజరు కావలసి ఉంది. దీంతో నల్గొండ(Nalgonda) నుండి ఓ కారులో తుంగతుర్తి(Thungathurthi) మండలం రావులపల్లి పాఠశాలలకు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అయిదుగురు కలిసి బయలుదేరారు. జాజిరెడ్డి గూడెం(jajireddy Gudem) వద్ద ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తుంగతుర్తి కేజీబీవీలో ఎస్ ఓ(SO) గా పనిచేస్తున్న కల్పన(Kalpana) అక్కడికక్కడే ఘటన స్థలంలోనే మృతి చెందింది.

Also Read: Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

అదుపుతప్పి బోల్తా కొట్టడంతో..

ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్(Praveen), అన్నారం ప్రధానోపాధ్యాయురాలు సునీత(Sunitha), రావులపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు గీత(Geetha), తుంగతుర్తి కేజీబీవీ ఎక్కువగా పని చేస్తున్న కల్పనలు నల్గొండ నుండి తుంగతుర్తి ప్రాంతానికి కారులో బయలుదేరారు. ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కల్పన ఘటన స్థలంలోని మృత్యువాత చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గీత కూడా మృతి చెందారు. ఇద్దరు హెడ్మాస్టర్లు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో హెడ్మాస్టర్ తులసి(Thulasi), రావులపల్లి హెడ్మాస్టర్లకు కూడా గాయాలయ్యాయి. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: Ap-TG Water Disputes: 30న నీటి పంపకాలపై కీలక భేటీ.. వాదనలు వినిపిస్తారా.. చేతులెత్తేస్తారా?

Just In

01

AP Politics: వరుసగా ప్రారంభాలు, శంకుస్థాపనలు.. ఏపీలో వైసీపీ ముఖచిత్రం ఏంటో?

Rangareddy Congress: రంగారెడ్డి జిల్లాలో విచిత్ర రాజకీయం.. అధిష్టానం ఆదేశాలను లెక్కచేయని జిల్లా నేతలు

AR Rahman: ముస్లిం అయిన మీరు ‘రామాయణ’కు ఎందుకు వర్క్ చేస్తున్నారని అడిగితే..

MLA Daggupati Prasad: హీటెక్కిన ఏపీ రాజకీయం.. వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే.. లేడీ డాక్టర్‌పై దౌర్జన్యం!

Khammam News: ఖమ్మం జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. ఈసారి మేయర్ పదవి మళ్లీ..?