Municipal Reservations: మహబూబాబాద్ మున్సిపాలిటీ వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. అందుకు సంబంధించిన జాబితాను సైతం విడుదల చేశారు. రిజర్వేషన్లలో అత్యధికంగా అన్ రిజర్వుడ్ స్థానాలకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చారు. మొత్తం 17 స్థానాలను అండ్ రిజర్వుడ్ కేటగిరీలకు కేటాయించారు. మిగతా కులాలకు అంతంత మాత్రంగానే రిజర్వేషన్లు కేటాయించడంతో ఆయా కులాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ(BC) వర్గానికి ఆరు, ఎస్టి(ST)కి 7, ఎస్సీ(SC)లకు ఐదు మొత్తం కలిపితే 18 దీంతోపాటు ఒక సీటును మాత్రం జనరల్ కేటగిరికి కేటాయించారు. అండ్ రిజర్వుడ్ స్థానాలు 17, బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి 18 స్థానాలు, అండ్ రిజర్వుడ్ ఒక స్థానంతో మొత్తం మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
చైర్మన్ ఎస్టీ జనరల్
1 వార్డు బీసీ మహిళ, 2 వార్డు ఎస్సీ జనరల్, 3 వార్డు అండ్ రిజర్వుడ్, 4 వార్డు ఎస్టి మహిళ, 5 వార్డు ఎస్టి మహిళ, 6 అన్ రిజర్వుడ్ మహిళా, 7 అన్ రిజర్వుడ్ మహిళా, 8 అండ్ రిజర్వుడ్ జనరల్, 9 వార్డు ఎస్సి జనరల్, 10 వార్డు అండ్ రిజర్వుడ్ మహిళా, 11 వార్డు ఎస్టి జనరల్, 12 వార్డు బిసి జనరల్, 13 వార్డు బిసి జనరల్, 14 వార్డు అండ్ రిజర్వ్డ్ జనరల్, 15 వార్డు ఎస్టీ జనరల్ 16 వార్డు అండ్ రిజర్వ్ మహిళ, 17 వార్డు ఎస్టి జనరల్, 18 వార్డు అండ్ రిజర్వ్ జనరల్, 19 వార్డు అండ్ రిజర్వ్ మహిళ, 20 వార్డు ఎస్టి జనరల్, 21 వార్డు అండ్ రిజర్వ్ మహిళ, 22 వార్డు బిసి మహిళ, 23 వార్డు ఎస్సీ మహిళా, 24 వార్డు ఎస్సీ జనరల్, 25 వార్డు ఎస్సీ మహిళ, 26 వార్డు ఎస్టీ మహిళ మహిళా,27 వార్డు అన్ రిజర్వ్ మహిళ, 28 జనరల్, 29,30,31 వార్డులు అన్ రిజర్వ్ మహిళ,32 వార్డు బిసి మహిళ, 33,34 వార్డు అన్ రిజర్వ్డ్ జనరల్,35 వార్డు అన్ రిజర్వ్డ్ మహిళ,36 బిసి జనరల్.
Also Read: Huzurabad: హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలో.. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల!
కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు
నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram Municipality) కి మొత్తం 16 వార్డులు విభజన చేయగా అందులో 2, 3,15 ఎస్టి మహిళలకు కేటాయించారు. 4,8 స్థానాలను ఎస్సీ మహిళకు కేటాయించారు.6,10,12 బీసీ కేటగిరికి రిజర్వ్ చేశారు. 1, 5,7,9, 11,13,14,16 స్థానాలను జనరల్ వార్డులుగా రిజర్వేషన్ కల్పించారు.
డోర్నకల్ మున్సిపాలిటీలో..
2 ఎస్టీ మహిళ, 7,8,14 వార్డులను ఎస్టీకి రిజర్వేషన్ చేశారు. 6 ఎస్సీ మహిళ, 9,15 ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. 1,3, 12,13 వార్డులను జనరల్‌కు కేటాయించగా, 4,5,10,11 వార్డు స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు.
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలు
రెండు ఎస్టీ, మూడు ఎస్ సి, 5 జనరల్ మహిళ, మూడు జనరల్, 3 బీసీ రిజర్వేషన్ లకు వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు.
డోర్నకల్ రిజర్వేషన్స్..
డోర్నకల్ మున్సిపాలిటీ(Dornakal Municipality)లో మొత్తం 15 వార్డులకు గాను 7,9, 10, వార్డులు ఎస్టీ వుమెన్‌కు కేటాయించారు.3, 11, 14 ఎస్టి జనరల్‌కు కేటాయించారు. నాలుగవ వార్డు ఎస్సి జనరల్ కు కేటాయించారు. 1, 5,12,15 స్థానాలను అండ్ రిజర్వుడ్ జనరల్ కు కేటాయించారు.2,6,8,13 స్థానాలను అండ్ రిజర్వుడ్ మహిళలకు కేటాయించారు.
Also Read: CM Revanth Reddy: యువతను ప్రపంచంతో పోటీ పడేల తీర్చి దిద్దుతాం.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి!

