MP Dharmapuri Arvind: బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని, తనను ఎలాంటి గద్దలు పొడవలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో గ్రూపులుంటే తప్పేంటని ప్రశ్నించడం గమనార్హం. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఓల్డ్ సిటీ నుంచి హిందువులను తరిమేసే కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఎంపీ ముందుగా ఆయన తమ్ముడికి సూక్తులు చెప్పాలని అసద్ కు సూచించారు. పురాణాపూల్ లో కర్ఫ్యూ వాతావతరణం ఉండటం కాంగ్రెస్ కు సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం వల్లే దాడి జరిగిందన్నారు. హిందువులకు ఎంఐఎం ఒక ఫోబియా క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లు సీఎం అయితే ఇలాగే ఉంటుందని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ హయంలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
మైనారిటీ ఓట్ల కోసం హిందువులను తాకట్టు
గతంలో కమ్యూనల్ గొడవల వల్లే చెన్నారెడ్డికి సీఎం పదవి పోయిందని అర్వింద్ మండిపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై జరిగిన దాడికి సంబంధించిన లిస్టును అర్వింద్ మీడియాకు చూపించారు. కాంగ్రెస్‌వి అన్ని దొంగ వ్యాపారాలేనని, పైగా హిందూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నాని విమర్శించారు. మైనారిటీ ఓట్ల కోసం హిందువులను తాకట్టు పెడుతున్నారని ఎంపీ విరుచుకుపడ్డారు. నిజామాబాద్ పేరును హిందూర్ గా మారుస్తామని చెప్పినందుకు తనపై పడి ఏడుస్తున్నారంటూ అర్వింద్ ఎద్దేవాచేశారు. ప్రభుత్వ వెబ్ సైట్ లో నిజామాబాద్ హిందూర్ అని ఉందని ఆయన గుర్తుచేశారు. దేశంలో 95 శాతం ముస్లింలు బిలో పావర్టీ లైన్(బీపీఎల్)లో ఉంటారని వివరించారు. అలాంటి ముస్లిం సమాజానికి ఇల్లు, రేషన్, వ్యాక్సిన్, అనేక సంక్షేమ పథకాలను ప్రధాని మోడీ ఇస్తున్నారన్నారు. ఇంత చేసిన మోడీకి వారు ఓటు ఎందుకు వేయరని అర్వింద్ ప్రశ్నించారు.
Also Read: MP Dharmapuri Arvind: సోషల్ మీడియాలో మంత్రి పోస్ట్ వైరల్.. కారణం అదేనా!
నిజామాబాద్‌కి వచ్చే దమ్ముందా?
బీజేపీ ముస్లింలకు సీట్లు ఇవ్వడం లేదని అంటున్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతితో తాను తన నిజామాబాద్ కార్పొరేషన్ లో 15 సీట్లు ముస్లింలకు ఇస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాముడికి బీజేపీ సభ్యత్వం ఉందని పీసీసీ చీఫ్ అంటున్నారని, మరి కాంగ్రెస్ కు సున్తీ ఉందా? చూస్కోవాలని ప్రశ్నించారు. అలా వ్యాఖ్యానించిన వారికి సిగ్గుండాలని, వారంతా హిందూ సమాజంలో చెడ పుట్టారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపోతే కేటీఆర్.. బీజేపీని గాలివాటమని అంటున్నారని, తాము గాలివాటమా? కాదా? అనేది తన సోదరి కల్వకుంట్ల కవితను.. కేటీఆర్ అడగాలని సూచించారు. కవిత.. రోజూ కేసీఆర్, కేటీఆర్ తోలు తీస్తోందని వ్యాఖ్యానించారు. కవిత, కేటీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకు రావడమే కేసీఆర్ చేసిన తప్పు అని అర్వింద్ పేర్కొన్నారు. బీజేపీ ఎక్కడుందో కేటీఆర్ కు నిజామాబాద్ కు వస్తే చూపిస్తామని, మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్‌కి వచ్చే దమ్ముందా? అని కేటీఆర్ కు అర్వింద్ సవాల్ విసిరారు. కవితకు చెప్పినట్లే.. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ కు కూడా చెబుతామని హెచ్చరించారు. ఒకపోతే మీడియా ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాయడం ముమ్మాటికి తప్పేనని అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తూ వ్యాఖ్యానించారు.
Also Read: MP Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. ఢిల్లీలో ఎంపీ గరం గరం

