MP Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. ఢిల్లీలో ఎంపీ గరం
MP Dharmapuri Arvind (imagecredit:twitter)
Telangana News

MP Dharmapuri Arvind: ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్.. ఢిల్లీలో ఎంపీ గరం గరం

MP Dharmapuri Arvind: నేను ఈ ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ అత్యంత కలతపెట్టే విషయాలను చూశానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. డిల్లీలో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. బీజేపీ తెలంగాణ యూనిట్ ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరపాలని వెంటనే ఈ అంశంపై డిమాండ్ చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబంతో స్పష్టమైన కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తోందని అరవింద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుదని, ఎందుకంటే వారికి కూడా ఇందులో ప్రమేయం ఉందని అన్నారు.

రాజకీయ ప్రతీకారం మాత్రమే కాదు

ఒక ఎంపీగా నా ఫోన్ కాల్స్, బెడ్ రూములు మరియు బాత్రూమ్‌లలోకి అక్రమంగా చొరబడటానికి నేను ఎన్నిక కాలేదు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే కాదు, నేరపూరిత లక్ష్యం మని తెలిపారు. 2019 నుండి, నాపై శారీరకంగా దాడి చేస్తూ, నిరంతరం వేధిస్తున్నారు. రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తం ప్రైవేట్ నిఘా సాధనంగా ఉపయోగించి కేసీఆర్ కుటుంబం నాపై నిరంతర ప్రచారం నిర్వహిస్తోందని అన్నారు. ఈ కుంభకోణంపై తీవ్రమైన మరియు పారదర్శక దర్యాప్తు కోసం వాదించాలని నేను మీ బీజేపీ ఎంపీ బండి సంజయ్, కిషన్ రెడ్డిని లను కోరుతున్నానని అన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు, కేంద్ర హోంమంత్రికి కూడా నేను ఈరోజు లేఖ రాస్తున్నానని అన్నారు.

Also Read: Boora Narsaiah Goud: రాహుల్ గాంధీపై.. బూర నర్సయ్య గౌడ్ సంచలన కామెంట్స్

ప్రజాస్వామ్యానికే ముప్పు

అధికారికంగా వారికి తెలియజేయడానికి మరియు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అరవింద్ తెలిపారు. ఈ దాడి కేవలం నాపై మాత్రమే కాదు, ఇది పూర్తి ప్రజాస్వామ్యం, మరియు ప్రజా ప్రతినిధుల గౌరవంపై దాడిచేసి నట్టే అని అన్నారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, కేసీఆర్ కుటుంబాన్ని మరియు ఇందులో పాల్గొన్న వారందరికి న్యాయం చేసేలా చూడాలని నేను కోరుతున్నానని ఎంపి అరవింద్ అన్నారు.

Also Read: Kedarnath Helicopter Crash: గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు.. రెండు నెలల గ్యాప్‌లో…

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క