Boora Narsaiah Goud (imagecedit:twitter)
తెలంగాణ

Boora Narsaiah Goud: రాహుల్ గాంధీపై.. బూర నర్సయ్య గౌడ్ సంచలన కామెంట్స్

Boora Narsaiah Goud: రాహుల్ గాంధీని చూస్తుంటే జెలెన్ స్కీ గుర్తొస్తున్నారని, ఆయన రాహుల్ గాంధీ కాదని, రాహుల్ జెలెన్ స్కీ అంటూ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవాచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయలంలో మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలిచ్చి మోసం చేసిందనేలా ఉన్న పోస్టర్‌‌ను బూర నర్సయ్య గౌడ్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ జెలెన్ స్కీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో బీసీ సామాజికి వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దమ్ముంటే కుల సర్వేను పబ్లిష్ చేయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి18 నెలలు పూర్తయ్యిందని, సర్పంచుల పదవీ కాలం పూర్తయ్యి కూడా 18 నెలలు గడుస్తోందన్నారు. రాష్ట్రంలో 5,717 మంది ఎంపీటీసీలు, 538 జెడ్పీటీసీలున్నారని, వీరి పదవీ కాలం కూడా పూర్తయిందన్నారు. 18 నెలల నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి పదవీకాలం ముగిసిన ప్రజాప్రతినిధులు, ప్రజల చెవిలో పువ్వులు పెడుతూనే ఉన్నారని బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవాచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని, ఇప్పటికైనా బేషరతుగా స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని బూర డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కుల సర్వేను పబ్లిష్ చేయాలన్నారు.

Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

సచివాలయం ప్రజలది కాదు

గత ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను కుదవపెట్టిందని విమర్శలు చేశారు. ప్రజల కోసం ఏమీ చేయని వారికి సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. గాంధీభవన్ లోనే ఉండి పరిపాలన కొనసాగించాలన్నారు. సచివాలయం ప్రజలదని, కాంగ్రెస్‌ది కాదని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీకి ఎవరెక్కువ డబ్బుల సంచులు పంపాలని కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. అలాంటి కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఆర్థికాంశాలపై సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఇచ్చింది ఎంత? తెచ్చింది ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? అనే వివరాలు బహిర్గతం చేయాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

Also Read: Indiramma houses: ఇండ్లున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు.. కాల్వపల్లి గ్రామస్తుల ఆవేదన

 

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్