GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు
GHMC (image cedit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు.. కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ?

GHMC: గ్రేటర్ హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ‌లో భాగంగా వాహనాల రద్దీ, ట్రాఫిక్ కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సర్కారు జీహెచ్ఎంసీ పాత పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు వంటి ప్రాజెక్టులను ప్రతిపాదించింది. కానీ ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాల్లో కూడా ఎట్టకేలకు జీహెచ్ఎంసీ హెచ్ సిటీ పనులను అమలు చేసేందుకు సిద్దమైంది. తొలి దశగా విలీనమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ నివారణకు జీహెచ్ఎంసీ తొలి ప్రాధాన్యతనిచ్చింది. ఇరుకైన రోడ్లపై అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే మైలార్ దేవులపల్లి, శంషాబాద్, కాటేదాన్ జంక్షన్లలోని ట్రాఫిక్ సమస్య నివారణపై జీహెచ్ఎంసీ కొంతకాలంగా స్టడీ చేసి, ట్రాఫిక్ సమస్య నివారణకు పరిష్కారాన్ని అన్వేషించింది.

నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్దం

ఈ మూడు రద్దీ జంక్షన్లను కవర్ చేస్తూ ఆరు లేన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసింది. రూ.345 కోట్లతో ఈ గ్రేడ్ సెపరేటర్ నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది. ఇందుకు సంబంధించి ఈ నెల 23న ప్రీ బిడ్ సమావేశాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. వచ్చే నెల 3వతేదీ వరకు బిడ్డను స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వీకరించిన బిడ్లను వచ్చేనెల 4వ తేదీన తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది. ఈ బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ నుంచి శివారులకు, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ చిక్కుల్లేకుండా తక్కువ సమయంలో చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.

Also Read: GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ.. వచ్చే నెల 11న సర్కారు ఉత్తర్వులు జారీ..!

కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ?

రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న కేబీఆర్ పార్కు చుట్టూ కూడా సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు హెచ్ సిటీ పనుల్లో భాగంగా ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను కూడా ముగించి ఏడాది కావస్తున్నా, నేటికీ పనులు పట్టాలెక్క లేదు. ప్రస్తుతం భూసార పరీక్షలు, సర్వేలు జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు చెబుతున్నారు. సుమారు రూ. 1090 కోట్ల వ్యయంతో ఈ పార్కు చుట్టూ పనులను చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జరుపుకున్న తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగంగా క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెడతామని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు ప్రకటించినా, ఇంకా పనులు ప్రారంభం కాలేదు. గత గులాబీ సర్కారు హయాం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనులకు ఎపుడు మోక్షం కలుగుతుందో, తమకు ఎప్పుడు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందోనంటూ వాహనదారులు వ్యాఖ్యానించారు.

Also Read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్కార్ అడుగులు.. మే నెలాఖరులో..?

Just In

01

Minister Ponguleti Srinivas: 18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!

Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు పరిధిలోకి వివాదం

Municipal Elections: ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఇవే!

GHMC Property Tax: ట్యాక్స్ కలెక్షన్‌పై జీహెచ్‌ఎంసీ ఫోకస్.. పండుగ తర్వాత వసూళ్ల వేట!

Short Film Contest: టాలెంటెడ్ అప్ కమింగ్ దర్శకులకు మంచు విష్ణు బంపరాఫర్.. ఏం చెయ్యాలంటే?