Jogipet Municipality: సంగారెడ్డి జిల్లాలోని అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు బయటపడ్డాయి. మున్సిపాలిటీ (Municipality) పరిధిలో 20 వార్డులకుగాను మొత్తం 16450 ఓటర్లు ఉండగా అందులో మహిళలు 8,564 కాగా పురుషులు 7,886 గా వున్నారు. వార్డులకు గాను మున్సిపల్ ఎన్నికల్లో భాగంగాఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెల్లడించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పుల తడకగా ఉందని చెప్పవచ్చు. 20 వార్డుల్లో అన్నిం టిలోను చోటు చేసుకున్న తప్పిదాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓటర్ల జాబితాలో మృతులు, పట్టణాలకు వలస వెళ్లిన వారు, పెళ్లి అయిన మహిళలు, జాబితాలో చనిపోయిన వారి పేర్లు కూడా ఒకటికి రెండు సార్లు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఒక్కరి ఫోటోను మరొకరి పేరు, అలాగే మహిళల ఓటర్లకు పురుషుడి ఫోటోను పెట్టడం శోచనీయం. గ్రామాల్లో ఉండి పట్టణ జాబితాలో కూడా ఓటరుగా నమోదు కావడం, ఒక వార్డుకు సంబం దించి స్థానికుల పేర్లు మరో వార్డులో నమోదయ్యాయి. తండ్రి పేరు కూడా అదే పేరును అచ్చువేయించారు. ఇలా ముసా యిదా ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం ఈ తప్పుల జాబితా అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతున్నాయి.
ఆత్మలకు.. ఓట్లు
ఎన్నికల కమిషన్ వారు సంబంధిత అధికారులు ఎ ప్పటికప్పుడు ఓటరు జాబితాను పరిశీలిస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నా ఏకంగా ఐదేళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు ఇంకా ప్రత్యక్షమవుతున్నాయి. 17వ వార్డులో యాదయ్య అనే వ్యక్తి చనిపోయి చాలా రోజులైనా రెండు చోట్ల ఆయన పేరును చేర్చారు. ఒక్క వార్డులోనే 5 నుంచి 8 మంది వరకు చనిపోయిన వారు ఉండడం విశేషం. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాబితాలో చిత్ర విచిత్రాలు
జోగిపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రాలుగా ఓటర్ల జాబితా ఉందనే చెప్పవచ్చు. అచ్చు తెలుగులో అచ్చువేయించిన జాబితాలో ఓటరు పేరు హీందీలో అచ్చు వేయడం ఓటరును ఆశ్చర్యపరిచింది. సదరు ఓటరుకు హీందీ రాకపోవడంతో ఇది నా పేరేనా అని అడిగి తెలుసుకున్నారు. 1వ వార్డులో ఒకే పేజీలో ఒక్క పేరు మూడు సార్లు ఒక్క ఫోటోతోనే అచ్చు వేయించారు. ఒక్కొక్కరికి రెండు, మూడు సార్లు మూడు చోట్ల జాబితాలో చేర్చారు. చనిపోయిన వ్యక్తుల ఫోటోలను కూడా రెండు చోట్ల చేర్చారు. మహిళ ఓటరు ఫోటో వద్ద పురుషుడి ఫోటోను పెట్టారు. జాబితాలో ఓటరు తల్లి, తండ్రి, భర్త పేరు వద్ద ఇంటి పేర్లు అచ్చయ్యాయి. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు ముసాయిదా జాబితాలో వివరాలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ నమోదులోనే తప్పు జరిగిందా?
బీఎల్ వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేక రించి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో తప్పి దాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ముసా యిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన నాలుగు రోజుల వ్యవ ధిలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఫిర్యాదు చేసినా జాబితాను యధావిధిగానే ప్రకటించడం విశేషం. తప్పుల ఓటర్ల జాబితాపై ఏ ఒక్క అధికారి సైతం నేరుగా సమాదానం ఇవ్వడం లేదు.
ఓటరు జాబితాను మళ్లీ పరిశీలిస్తాం
ముసాయిదా జాబితా విడుదల చేసిన తర్వాత ఆ భ్యంతరాలు వస్తున్నాయి. ఈ జాబితాలో కొందరు మృతుల పేర్లు నమోదైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. . మృతులకు సంబంధించి వివరాలను రెవెన్యూ అధికారులకు తెలియజేసి జాబితాలో చనిపోయినట్లు స్టాంప్ వేయిస్తాం. జోగిపేట– అందోలు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16450 ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 8564 కాగా పురుష ఓటర్లు 7886 గా వున్నారు.
Also Read: Mahabubabad District: ఆ జిల్లాలో ఫంక్షన్ హాల్స్ అన్ని వివాదాస్పదమే.. అధికారుల మౌనం.. అక్రమాలకు కవచం?

