Ramchander Rao: ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి తమ మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన సంచార్ సాథి యాప్ ను దేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో ట్రాఫిక్ ఛలానాల వసూళ్ల కోసం వాహనదారుడి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేస్తారా? అని ప్రశ్నించారు. జల వివాదంపై కాంగ్రేస్ సర్కారు సుప్రీం కోర్టులో కేసు వేసినట్టే వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం స్టేటీ బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించండి
ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ వాటర్ ఇష్యూతో తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ రగల్చేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. జల వివాదంలో తాము తెలంగాణ రాష్ట పక్షాన ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా నీటి పంపకాల్లో వాటాలను తేల్చుకోవాలని, కొత్తగా మీరు చెప్పేదేముందని ప్రశ్నించారు. గతంలో తమిళనాడు(Thamilanadu), కర్ణాటక(Karnataka) మధ్య కావేరి నది జలాల వివాదాన్ని దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(Atal Bihari Vajpayee) పరిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాటర్ ఇస్యూను బీజేపీ మాత్రమే పరిష్కరించగలదని ఆయన గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన పై ముందు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి, అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి, ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ ఛలానాలు వసూలు చేసుకుని రెవెన్యూ జనరేట్ చేయాలని సర్కారు భావిస్తుందని, అందులో భాగంగానే వెహికల్ ఓనర్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇంకా నయం ఈ నిబంధన సైకిల్స్‌కు వర్తింపజేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని.. బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం!
మద్యం తాగొద్దని కౌన్సిలింగ్ ఇవ్వాలే..
పెరుగుతున్న పట్టణీకరణకు అనుకూలంగా పెరుగుతున్న ట్రాఫిక్ కు నియంత్రణ చాలా ముఖ్యమని, యూత్ కి కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్డు సేఫ్టీ పై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) చేయడం తప్పేనని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు పట్టుకున్న వ్యక్తిని వీడియోలు(Videos) తీయడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రకమైన వీడియోలు రకరకాల ప్రచార మాధ్యమాల్లో టెలికాస్ట్ కావటంతో పట్టుబడిన వ్యక్తి కుటుంబం ముందు తలెత్తుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. మద్యం తాగొద్దని కౌన్సిలింగ్ ఇవ్వాలే తప్పా, వ్యక్తిగత గోప్యంతకు భంగం కల్పించొద్దని రామచందర్ రావు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం పరిష్కారం కావటం రెండు పార్టీలకు ఇష్టం లేదని, జల వివాదాలకు కాంగ్రేస్సే కారణమన్నారు. జల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ వాదన అని, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చునని సూచించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితోనూ తమకెు పొత్తు ఉండదని, జనసేన పార్టీకి చెందిన నేతలెవ్వరూ మా దగ్గరికి రాలేదని, మాతో చర్చలేమీ జరపలేదని స్పష్టం చేశారు. జనసేన కూడా ఒక రాజకీయ పార్టీ అని, మున్సిపల్ ఎన్నికల్లో వారు పోటీ చేస్తామని ప్రకటించడంలో తప్పేమీ ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎక్కడైనా జనసేన తమకు మద్దతు ఇస్తే తీసుకుంటామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థే దొరకలేదని, ఇంకా ఆ పార్టీ ఎక్కడ ఉందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Also Read: Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ పై.. ఎటూ తేలని వ్యవహారం

