Bandi Sanjay: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్ జీ పథకం అద్బుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. గ్రామానికి స్థిర ఆస్తులను స్రుష్టించడంతో పాటు ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుందన్నారు. వ్యవసాయ సీజన్ లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కల్పించబోతోందన్నారు. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.17 వేల కోట్లు కేటాయించబోతోందన్నారు. తెలంగాణకు సైతం రూ.340 కోట్లు అదనంగా రాబోతున్నాయని తెలిపారు. ఇంత గొప్ప పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. తొలుత ఈ పథకానికి మహాత్ముడి పేరే కాంగ్రెస్ పెట్టలేదని చెప్పారు. పాలకులు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజమేనని, గతంలో వాల్మీకీ,అంబేద్కర్ పేర్లతో వాజ్ పేయి ప్రభుత్వం వాంబే స్కీం పేరుతో ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి పేర్లను తొలగించి ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకంగా మార్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుండగా, కాంగ
ఏటా రూ.86 వేల కోట్ల నిధులు ఖర్చు
మంగళవారం కరీంనగర్ లోని త్రిధా హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ బాస సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్ లతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ వీబీ జీ రామ్ జీ పథకం ఉద్దేశాలను వివరిస్తూనే కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు. వీబీజీ రామ్ జీ పథకం అనేది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామానికి దీర్ఘకాలిక ఆస్తులు కూడబెట్టేందుకు ఉద్దేశించినదనీ, ఉపాధి పథకం కింద ఏటా రూ.86 వేల కోట్ల నిధులు ఖర్చు చేసినా గ్రామానికి ఆస్తులు మాత్రం పెద్దగా పెరగలేదనీ, తవ్విన గుంతలే తవ్వడం వంటి పనులే చేశారని విమర్శించారు. ఈ నూతన చట్టబద్ద ఉపాధి హామీ పథకం అమలు వల్ల ఏటా రూ.లక్షా 51 వేల 282 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా వేసిందన్నారు. వీబీ-జీ రామ్ జీ అనే పథకం కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం తప్పనిసరి. ఇందులో కేంద్రం వాటా రూ.95 వేల 692 కోట్లు కాగా,అన్ని రాష్ట్రాల వాటా మొత్తం కలిపి రూ.55 వేల 589 కోట్లు అన్నారు. గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 17 వేల కోట్లు అదనంగా కేంద్రం ఖర్చు చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.340 కోట్లు అదనంగా కేంద్రం అందించనున్నట్లు బండి తెలిపారు.
Also Read: Human Rights Commission: చైనా మాంజా అమ్మకాలపై.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్!
ఆస్తులు నిర్మించడం తప్పా?
వీబీ-జీ రామ్ జీ కూలీలకే కాదు, రైతుల నెత్తిన పాలుపోసే పథకమని ఆయన తెలిపారు. ఈ కొత్త చట్టంతో వ్యవసాయ సీజన్ లో గరిష్టంగా 60 రోజుల పాటు ఈ చట్టం కింద పనులు చేపట్టకుండా నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లు, దీని వల్ల రైతులకు అదనపు భారం ఉండదని, పేదల కూలీ పనులకు ఢోకా ఉండదన్నారు. వ్యవసాయ సీజన్ లో కచ్చితంగా ఏటా 60 నుండి 80 రోజుల పని దొరుకుతుందని, ఇవిగాక జీ రామ్ జీ పథకం ద్వారా 125 రోజుల పని పక్కాగా లభించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మొత్తంగా ఏటా సగటున 200 రోజులు పని లభిస్తుందన్నారు. ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వడానికి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన నిధులను 6 నుండి 9 శాతానికి పెంచినట్లు, ఉపాధి పనుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక. పనుల ద్వారా గ్రామానికి ఆస్తులను నిర్మించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని, కేంద్ర ప్రభుత్వం గైడ్ గా వ్యవహరిస్తోందే తప్ప అజమాయిషీ చేయదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ కు అక్కసు ఎందుకు? గ్రామానికి ఆస్తులు నిర్మించడం తప్పా? రైతులకు కూడా మేలు జరిగే పథకం కదా? తెలంగాణకు అదనంగా రూ.340 కోట్లు వస్తుంటే వద్దంటారా? వీబీ జీ రామ్ జీ పథకం కావాలా? వద్దా? కాంగ్రెస్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గాంధీ పేరును వాడుకున్నారు
ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై నీచ రాజకీయడం సిగ్గు చేటు అని, వాల్మీకీ, అంబేద్కర్ ఆవాస్ యోజన(వాంబే) పేరుతో వాజ్ పేయి తెచ్చిన ఇండ్ల నిర్మాణ పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు తీసేశారు? వాల్మీకీ, అంబేద్కర్ పేర్లను తీసేసి ఇందిరా ఆవాస్ యోజన పథకంగా ఎందుకు మార్చారు? వాల్మీకీ, అంబేద్కర్ వంటి వారిని అవమానించినట్లా? కాదా అని మండిపడ్డారు. గాంధీ పేరును వాడుకున్నారే తప్ప మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పాతరేసి ఆయన ఆత్మను క్షోభకు గురిచేసిన ఘాంఢీ వారసులు కాంగ్రెస్ నేతలని, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన గాంధీ ఆశయాలను నీరు గార్చారని విమర్శించారు. కాంగ్రెస్ అంటే జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్లే కదా? అని వ్యాఖ్యానించారు. పథకాల మార్పుపై కాంగ్రెస్ చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారమా? అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శ్రీరాముడి పేరును బతికినంత కాలం పెట్టు కుంటామని, మా కార్యకర్తలు ఎక్కడికి పోయినా జైశ్రీరాం అంటారనీ, మా ఊపిరి ఆగిపోయే క్షణంలో కూడా భారతమాతా కీ జై జై శ్రీరాం అంటామన్నారు.
Also Read: Nitin Nabin Sinha: బీజేపీ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం.?

