Wow! What A Catch Suyash
స్పోర్ట్స్

Cricketer Suyas Sharma: వావ్‌! వాట్‌ ఏ క్యాచ్ సుయాష్‌..

Wow! What A Catch Suyash : ఐపీఎల్‌ 2024 సీజన్‌ హంగామా స్టార్ట్‌ కానే అయ్యింది. ఈ సీజన్ ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను ఫ్యాన్స్‌కి అందించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య గతరాత్రి 7:30 గంటలకు జరిగిన మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ కొనసాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా హెన్రిచ్‌ క్లాసెన్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది సన్‌రైజర్స్‌ శిబిరంలో గెలుపుపై ధీమా పెంచారు.

కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన కేకేఆర్…సాల్ట్, రసెల్ అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆఖర్లో రసెల్ 7 సిక్స్‌ర్లు, 3 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇందుకు కేకేఆర్ 200 పరుగుల మార్క్‌ని దాటేందుకు దోహదపడింది.ఈ క్రమంలో కేకేఆర్‌ ఆటగాళ్లు హర్షిత్‌ రాణా, సుయాష్‌ శర్మలు వారి ఆనందాన్ని ఎంతో సేపు నిలబడనీయలేదు.చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేసిన రాణా త్రో బాల్స్ వేసి సన్‌రైజర్స్‌ గెలుపును అడ్డుకోగా, సుయాష్‌ శర్మ కీలక దశలో మెరుపు క్యాచ్‌ పట్టి ఆరెంజ్‌ ఆర్మీ చేతుల్లో నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు.

Read Also : విరాట్ కోసం అనుష్క,అకాయ్

సుయాష్‌ ఆ క్యాచ్‌ మిస్‌ చేసి ఉంటే బౌండరీ లభించి సన్‌రైజర్స్‌ సునాయాసంగా మ్యాచ్‌ గెలిచేది. ఒకవేళ ఆ క్యాచ్‌ డ్రాప్‌ అయ్యి ఉంటే అప్పటికే శివాలెత్తి ఉన్న క్లాసెన్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది సన్‌రైజర్స్‌ను గెలిపించేవాడు. సుయాష్‌ అందుకున్న ఈ అద్భుతమైన రన్నింగ్‌ ‍క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అని ఇందుకే అంటరేమో అని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?