Anushka, Akai from London for Virat Kohli
స్పోర్ట్స్

Virat Kohli : విరాట్ కోసం అనుష్క,అకాయ్

Anushka, Akai from London for Virat Kohli : ఐపీఎల్ 2024 ఈ ఏడాదిలో జరగబోయే మ్యాచ్‌లన్నీ కూడా క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని కిక్‌ని నింపుతోంది. ఎందుకంటే..మొదటి మ్యాచ్‌లో బెంగళూరు, చెన్నై తలపడటంతో అభిమానులకు మంచి జోష్‌ ఇచ్చినట్టయింది. తాజాగా ఈ మ్యాచ్‌లో కొహ్లీ సందడి చేయనున్నారు. తనకోసం తన భార్య ఓ కీలక డెసీషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన కొడుకుతో సహా.. లండన్ నుండి ఇండియాకు వచ్చేందుకు రెడీ అయిపోయిందట అనుష్క.

ఇక ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓడిపోయినా మ్యాచ్‌ని ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్ చేశారు. ఇక స్టార్టింగ్ ఐపీఎల్ మ్యాచ్‌లోనే కొహ్లీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అయితే కొహ్లీని ఉత్సాహపరిచేందుకు గతకొన్ని రోజులుగా అతని భార్య, కొడుకు కనిపించలేదు.

Read Also : ధోనీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్, CSK కొత్త కెప్టెన్‌!

తన కుమారుడి పేరు అకాయ్ పేరు పెట్టి అందుకు సంబంధించిన న్యూస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అకాయ్‌తో కలిసి అనుష్క లండన్‌లో ఉండగా.. గతవారం విరాట్ ఐపీఎల్ కోసం తన భార్య కొడుకుని వదిలి భారత్‌కి వచ్చాడు. అయితే క్రికెట్ పిచ్‌లో ఐపీఎల్ అయినా.. మరే మ్యాచ్ అయినా విరాట్‌కి సపోర్ట్‌గా అనుష్క స్టేడియంలో కఛ్చితంగా ఉండాల్సిందే. అంతేకాదు వీరిద్దరు పరస్పరం సైగలు చేసుకునే వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. అంతేకాదు ఇది చూసిన ఫ్యాన్స్ సైతం తెగ ముచ్చటపడుతుంటారు.

ఇక ఇదిలా ఉంటే…మరికొద్దిరోజుల్లోనే అనుష్క లండన్ నుండి ఇండియాకు తిరిగి వస్తుందని టాక్‌. అంతేకాదు ఆర్‌సీబీ మ్యాచ్‌ల్లో విరాట్‌ని ఎప్పటిలాగే ఎంకరేజ్ చేసేందుకు అకాయ్‌తో సందడి చేయనుందట. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న అనుష్క,విరాట్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక అనుష్క చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏం లేకపోవడంతో ఆమె కన్‌ఫాంగా విరాట్‌ని ఎంకరేజ్ చేయడానికి రానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఇంకెన్నీ గమ్మత్తులు, జిమ్మిక్కులు ఉంటాయో…ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అని ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు.