MLC Dasoju Sravan: వాహనదారులపై చలాన్లు వేసే ముందు రోడ్లపై గుంతలు పూడ్చాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ (MLC Dasoju Sravan) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ చలాన్లు నేరుగా పోలీసు వాళ్ళ అకౌంట్లలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పడం అన్యాయం అన్నారు. గ్రూప్1 పరీక్షలను అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలి ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క పదం బయటకు వచ్చిన దానికి చట్టబద్దత ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానమా?
ట్రాఫిక్ చలానన్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సీఎంకు ఐదు పేజీల లేఖ రాస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎవరితోనైనా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారా…?లేక మీటింగుల్లో నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా రేవంత్ రెడ్డి ప్రజల బ్యాంకుల ఖాతాలను దోచుకుతినాలని చూస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రభుత్వం సొమ్ము పేదలకు ఇవ్వాలని అంటుంటే రేవంత్ రెడ్డి పేదల డబ్బు దోచుకోవాలని చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ పార్టీ విధానమా? అని ప్రశ్నించారు.
అడ్వకేట్ జనరల్ తో రేవంత్ రెడ్డి మాట్లాడారా?
వ్యక్తిగత,ఆస్తి హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు అకౌంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. క్యాబినెట్ మంత్రులతో చర్చించి రేవంత్ రెడ్డి చలాన్లపై ప్రకటన చేశారు. అడ్వకేట్ జనరల్ తో రేవంత్ రెడ్డి మాట్లాడారా? పింఛన్లు,రిటైర్డ్ ఉద్యోగులకు ఆటో క్రెడిట్ రేవంత్ రెడ్డి ఎందుకు చేయడం లేదన్నారు. ట్రాఫిక్ ఛలాన్లతో మొదలుపెట్టి నల్లా బిల్లులు,ఇంటి పన్ను బిల్లులు మొత్తం ఆటో డెబిట్ రేవంత్ రెడ్డి చేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తిట్టిన ప్రతిసారి ఎవరు ఆటో డెబిట్ చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి వాడుతున్న కార్లపై మూడు ఛలాన్లు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అని సూచించారు.
Also Read: Fertility Centers: ఫెర్టిలిటీ సెంటర్లపై సర్కార్ ఫుల్ సీరియస్.. మూడు సెంటర్ల సీజ్!

