Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం
Kodanda Reddy ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kodanda Reddy: నకిలీ విత్తనాలు అరికట్టడంలో.. గత ప్రభుత్వం విఫలమైంది.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Kodanda Reddy: రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విత్తనం చట్టం రూపొందించామని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి (Kodanda Reddy) అన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో గత ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. హైదరాబాదులోని బీఆర్‌కే భవన్ లో ని రైతు కమిషన్ కార్యాలయంలో విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఒక్కో సమస్యను పరిష్కారం చేస్తున్నామని, ముఖ్యంగా రైతంగానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసింది. లక్ష 10 వేల కోట్ల సాయం చేసిందన్నారు. ములుగు జిల్లా ఆదివాసీ రైతులకు ప్రైవేట్ విత్తన కంపెనీలు నకిలి విత్తనాల అందించాయని, కమిషన్ చొరవ తీసుకొని దాదాపు 4 కోట్ల పరిహారం అందించేలా చేశామన్నారు.

ముసాయిదా చట్టం తుది దశకు చేరింది

మిర్చి, పత్తి, వరి లాంటి విత్తనాలను అమ్మినప్పుడు రైతులు నష్టపోతున్నారు. ఈ అంశాలను అన్నిటికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా కమిటీ వేసిందన్నారు. రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని పెండింగ్ లో ఉంచాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొస్తున్న ముసాయిదా చట్టం తుది దశకు చేరిందన్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి వద్ద కూడా సమావేశం పురయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముసాయిదా తెచ్చింది.

Also Read: Kodanda Reddy: కేంద్ర విత్తన చట్టం ముసాయిదా లో సవరణలు చేయాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

తుది ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం

ఇది పూర్తిగా విత్తన కంపెనీలకు అనుకూలంగా ఉంది. దీనిపై డిస్కషన్ చేసింది. తుది ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం. దేశంలో విత్తనాలు, రసాయన ఎరువులు అన్ని మల్టీ నేషనల్ కంపెనీలకే అనుకూలంగా ఉన్నాయి. గతంలో చాలా అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే కానీ గత ప్రభుత్వం కంపెనీలకు అధికారాలు కట్ట బెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్, అగ్రికల్చర్ డైరెక్టర్ బి.గోపి, కమిటీ సభ్యులు దొంతి నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్, మెంబర్ సెక్రెటరీ గోపాల్, అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ నర్సింహారావు, కమిషన్ అధికారులు సంధ్యారాణి, హరి వెంకట ప్రసాద్, శ్రావ్య , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also ReadKodanda Reddy: కేంద్ర విత్తన చట్టం ముసాయిదా లో సవరణలు చేయాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

Just In

01

Prabhas: ప్రభాస్.. ఈ కటౌట్‌ని వాడుకోలేకపోయిన డైరెక్టర్స్ వీరే..!

People Media Factory: ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’పై మెగా దెబ్బ.. మొన్న పవన్, ఇప్పుడు చిరు!

Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Nenu Ready Teaser: 30 వేల జీతానికి ఇలాంటి దరిద్రపుగొట్టు జాబ్ ఎవడైనా చేస్తాడా?

Bhatti Vikramarka: వారికి గుడ్ న్యూస్.. జంట పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!