Kodanda Reddy: హర్యానాలో బీజెపి ప్రభుత్వం వున్నా అది ముందుకు పోవడం లేదు.. మేము హర్యానా కు స్టడీ టూర్ పై వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది. ఇక్కడ కూడా సీడ్ బిల్లు తీసుకురావడానికి కసరత్తు చేశాం. అది మంత్రి వద్ద ఫైల్ వుంది..త్వరలోనే కమిషన్ దానిపై మంత్రితో చర్చిస్తాం.. అని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. బిఆర్కె భవన్లోని రైతు కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో విత్తనం చాలా ముఖ్యం.. విత్తనం పండించే వారికంటే కంపెనీలే లాభపడుతున్నాయన్నారు.కేంద్ర విత్తన చట్టం-2025 ముసాయిదా పై కమిషన్ లోతుగా ఆలోచన చేసింది. రైతుకు ఇబ్బంది కాకుండా విత్తనం హక్కు ఉండేలా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం..ముసాయిదా విత్తన చట్టం చూస్తే.. చాలా లోపాలున్నాయి అన్నారు.
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
1994 నుండి విదేశీ కంపెనీలు దేశంలోకి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు వుంటాయని చెప్పిన 2004 లో అప్పటి ప్రభుత్వం తేల్చి చెప్పిందని, అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని..కల్తీ విత్తనాలను కొన్ని కంపెనీలు బ్రాండ్ వేసుకొని అమ్ముతున్నాయి. 40 శాతం విత్తనాలు తెలంగాణలోనే సాగవుతున్నాయి. లక్షల ఎకరాల్లో విత్తనాల సాగు జరుగుతోంది..ములుగులో గిరిజన రైతులు మొక్కజొన్న విత్తనం సాగుచేస్తున్నారు.. ములుగు రైతులు నష్టపోతే కమిషన్ చొరవతీసుకుని న్యాయం చేశాం అన్నారు. కొన్ని సీడ్ కంపెనీలు ఇష్టం వచ్చినట్లు అక్కడ వ్యవహరించాయి.
Also Read: Kodanda Reddy: పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలి : గవర్నర్ తో రైతు కమిషన్ భేటి
గిరిజన రైతులకు న్యాయం చేయాలి
కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి నివేదికను తెప్పించాం..ములుగులో విత్తనం సాగుచేసే రైతులు, పశువులు చనిపోయాయి..చాలా మంది రైతులు మంచాన పడ్డారు. గిరిజన రైతులకు న్యాయం చేయాలనీ చాలా సమావేశాలు పెట్టాం..మల్టీనేషనల్ కంపెనీల నుండి నష్టపరిహారం వచ్చేలా చూశాం..4 కోట్లవరకు నష్టపరిహారం కింద ఇప్పించాం.. దేశ చరిత్రలో నష్టపరిహారం ఇప్పించింది తొలిసారి అని, అదే తరహాలో విత్తన చట్టంలో నష్టపరిహారం వచ్చేలా కమిషన్ సూచించింది.. నకిలీ విత్తనాలతో కతా పూత రాక రైతులు నష్టపోతున్నారు.. రైతు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు అన్నారు. ముందు చూపుతోనే 1966 లోనే చట్టం తెచ్చాం. కానీ గత కొన్నేళ్లుగా నకిలీ విత్తనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. అన్ని ఆధారాలతో కేంద్ర విత్తన చట్టం ముసాయిదా లో సవరణలు చేయాలని చెప్పాము..రాష్ట్ర పరిధిలో కూడా చట్టాలు చేసుకునే అవకాశం వుంది.
కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం
వ్యవసాయ రంగం రాష్ట్ర పరిధిలో ఉంటది. మల్టీనేషనల్ కంపెనీలు ఎక్కడో అనుమతి తీసుకొని రాష్ట్రాల్లో అమ్ముకొనే అవకాశం ఇస్తారా రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులుండాలి. గోధుమల్లో వయ్యారి భామ , మరికొన్ని విత్తనాల్లో సర్కారీ తుమ్మ వచ్చింది. వాటిద్వారా రాష్ట్రమంతా ఆ మొక్కలు వ్యాపించాయి. అన్ని విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాం అన్నారు. రైతు అమాయకుడు.. కల్తీ విత్తనాలను అరికట్టడానికి హర్యానా ప్రభుత్వం అమైన్ మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
రైతులకు అనుకూల నిర్ణయాలు
కానీ ఆ బిల్లు గవర్నర్ వద్దనే ఆగిందన్నారు. రైతు కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటే రైతే రాజు అవుతాడు..రైతు హక్కులను కాపాడే విధంగా కేంద్ర ముసాయిదా లేదు.. కేంద్రం తెచ్చిన విత్తన చట్టం ముసాయిదాను తిప్పి కొట్టాం అన్నారు. మూల విత్తనం వద్దే రైతు మోసపోతున్నాడు.. కొన్నేళ్లుగా కల్తీవిత్తనాలతోనే రైతులు నష్టపోతున్నారు. కల్తీవిత్తనాలను అరికట్టడానికి కంపెనీలను నియంత్రించాలి అన్నారు. ఉత్పత్తి, ధర, క్వాలిటీ కంట్రోల్ విషయంలో స్పష్టత ఉండాలని, పత్తి, మొక్క జొన్న, వరి విత్తనాల ఉత్పత్తి కి తెలంగాణ కేంద్రం.. రైతు విత్తనం నాటిన తర్వాత మొలకెత్తని పక్షంలో విత్తన కంపెనీలపై చర్యలు ఉండేలా చట్టం ఉండాలన్నారు.
Also Read: Kodanda Reddy: భూమి హక్కు రైతుకు ఉన్నట్టే విత్తన హక్కు ఉండాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

