Mexico | మెక్సికోలో ఘోర ప్రమాదం... 40 మంది సజీవ దహనం
Mexico
అంతర్జాతీయం

Mexico | మెక్సికోలో ఘోర ప్రమాదం… 40 మంది సజీవ దహనం

మెక్సికో (Mexico)లో ఘోర ప్రమాదం జరిగింది. కాంకున్​ నుంచి టాబాస్కో వైపు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొనడంతో మంటలు చెలరేగి ఏకంగా 40 మంది సజీవ దహనమయ్యారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటన దక్షిణ మెక్సికోలోని ఎస్కార్సె నగర సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

మృతుల్లో 38 మంది ప్రయాణీకులు కాగా మరో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన బస్సులో మొత్తం 48 మంది ఉన్నట్లు వారు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృత దేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

Also Read : ఆస్తి కోసమే జనార్ధన్ రావు హత్య.. ఏసీపీ క్లారిటీ

వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై టాబాస్కోలోని కమల్​ కాల్కో మేయర్​ ఒవిడియో పెరాల్టా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Just In

01

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు