Road Safety Week: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మేడ్చల్ GHMC పరిధిలోని ప్రాంతంలో మల్లారెడ్డి కాలేజీకి చెందిన NSS, NCC విద్యార్థులతో మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్(CI Madhusudhan), మేడ్చల్ సీఐ సత్యనారాయణ(CI Sathyanarayana) పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సీట్ బెల్ట్ వినియోగించాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, వేగ నియంత్రణ పాటించాలి వంటి నినాదాలతో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు.
Also Read: EC on RUPPS: తెలంగాణ రాజకీయ పార్టీలకు.. ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే?
ముఖ్యంగా యువత..
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవకుండ తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు మాత్రమే కాకుండా పాదచారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి(Vemula Srinivas Reddy), మధుకర్ యాదవ్,టైలర్ రాజ ,రాజశేఖర్ రెడ్డి, కాలేజీ అధ్యాపకులు, పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

