Manikonda Land Scam: మణికొండలో సమాధులను సైతం వదలని కబ్జాకోరులు
అండదండగా నిలుస్తున్న అధికారులు
చర్యలు తీసుకోవడంలో వైపల్యం చెందుతున్న యంత్రాంగం
రాజేంద్రనగర్/స్వేచ్ఛ: చనిపోతే గుర్తుగా సమాధులు ఉంటాయని ఆ గుర్తులు కూడా చెరిపేసి దొంగ పట్టాలు సృష్టించి అమ్మకాలు జరుపుతున్న వైనం మణికొండ(Manikonda)లో పెద్ద ఎత్తున జరుగుతుంది. స్థానికంగా స్థలాలు లక్షల్లో ధరలు పలుకుతుండటంతో అక్రమార్కులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. గజం లక్షపైగా ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చస్తే సమాధులపై భేరం చేస్తున్న వైన్యం మణికొండలో చోటు చేసుకుంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఇలాంటి అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
రెవెన్యూ అధికారులు చోద్యం
నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ సర్వేనెంబర్ 261 లో 2006 అప్పటి ప్రభుత్వం అధికారికంగా 60 గజాల చొప్పున నిరుపేద ప్రజలకు 278 పట్టాలను మంజూరు చేయగా అక్కడ పేదలు నిర్మాణాలు చేసుకోగా ఖాళీ స్థలంపై కొందరు కబ్జాదారులు కన్ను వేసి 500 పైగా నిర్మాణాలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కనీసం ఏం జరుగుతుందని విషయం తెలుసుకోకుండా కేవలం కాలయాపన చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు కుమ్మక్కై అంతా వారే ఉంటూ ఫేక్ పట్టాల(Fake Documents)ను సృష్టించి ఇష్టం వచ్చినట్లు అమ్మకాలు చేస్తున్నారు. ఇక మణికొండ మున్సిపల్ అంటేనే కోట్లలో వ్యాపారం, ఇదే అదునుగా చూసుకొని కబ్జా దారులు ఇష్టం వచ్చినట్టు దొంగ పటాలను సృష్టించి నిర్మాణాలు చేస్తున్నారు.
Also Read: Yuvraj Singh Hyd Visit: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన యువరాజ్.. నేడే ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవం
ముఖ్యమంత్రి దృష్టికి..
ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ(Revenue) అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమార్కులు ఒక ముఠాగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నట్లు ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న ఈనాడు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంది ఏముంది ఎంతుంది అనేది స్పష్టమైన మార్కింగ్ చేయడం లేదని స్థానికుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్లనే అక్రమార్కులు రెచ్చిపోయి దొంగ పటాలను సృష్టించి విక్రయాలు జరుపుతున్నారు కోట్లను కులగొడుతున్నారు. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వదిలి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసేవారు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇకపై స్పందించకపోతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి(CM) దృష్టికి తీసుకెళ్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Also Read: LIC Jeevan Utsav: సింగిల్ ప్రీమియంతో ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ.. వివరాలు ఇవే

