Triple Murder Case: తల్లి, చెల్లి, తమ్ముడిని చంపి నడుచుకుంటూ..
Delhi-Crime-News (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Triple Murder Case: తల్లి, చెల్లి, తమ్ముడిని చంపేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వ్యక్తి.. ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్

Triple Murder Case: యావత్ ఢిల్లీ ఉలిక్కిపడే (Delhi Horror) షాకింగ్ ఘటన సోమవారం జరిగింది. నగరంలోని లక్ష్మీనగర్‌లో 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ట్రిపుల్ మర్డర్‌కు (Triple Murder Case) పాల్పడ్డాడు. జన్మనిచ్చిన తల్లిని, రక్తం పంచుకుపుట్టిన చెల్లి, తమ్ముడిని కిరాతకంగా హత్య చేశారు. చంపేసిన తర్వాత నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లి హత్యలు గురించి చెప్పి సరెండర్ అయ్యాడు. దీంతో, నిందిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు బృందాలు వెంటనే బయలుదేరి, లొకేషన్‌కు వెళ్లి చూడగా నిజంగానే ఇంట్లో మూడు మృతదేహాలు ఉన్నాయి. దీంతో, పోలీసుల సైతం షాక్‌కు గురయ్యారు. నిందితుడి పేరు యశ్వీర్ సింగ్ అని, సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో అతడు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని అధికారులు వెల్లడించారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సభ్యులు ముగ్గుర్నీ చంపేశానంటూ చెప్పాడని పేర్కొన్నారు.

Read Also- Khammam News: ఓరినాయనా.. గ్రామ పంచాయతీనే పేకాట అడ్డాగా మార్చిన ఉపసర్పంచ్..?

మృతుల పేర్లు తల్లి కవిత (46), చెల్లెలు మేఘన (24), తమ్ముడు ముకుల్ (14) అని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే, నిందిత వ్యక్తి చెప్పిన లొకేషన్‌కు వెళ్లామని, ఇంటిని పరిశీలించగా మూడు మృతదేహాలు కనిపించాయన్నారు. ఒకరు పెద్దావిడ, ఇద్దరు పిల్లలు అని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘోరానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also- BIG Academy: గ్రాండ్‌గా ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవం.. రేపు హైదరాబాద్‌కు యువరాజ్ సింగ్

Just In

01

Mahabubabad News: రసవత్తరంగా మానుకోట మునిసిపాలిటీ చైర్మన్ రేస్.. సమీకరణాలు ఇవే

Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?

Stock Markets Fall: బాబోయ్.. ఇన్వెస్టర్లకు ఒకే రోజు రూ.8.1 లక్షల కోట్లు నష్టం.. అంతా ట్రంప్ వల్లే!

YS Jagan on Amaravati: ‘రాజధాని నిర్మాణం సాధ్యమా?’.. అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!