Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి హరీశ్ రావు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ గతంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను హరీశ్ రావు ట్యాప్ చేయించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: Phone Tapping Case: నేడు సాయంత్రం సీపీతో సమావేశం కానున్న సిట్ బృందం!
హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను స్క్వాష్ చేస్తూ ఉత్తర్వులు
ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను స్క్వాష్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హరీశ్ రావు విచారణకు అనుమతించాలని అందులో కోరింది. చక్రధర్ గౌడ్‌ను సైతం ప్రతివాదిగా చేర్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనున్నది.

